ETV Bharat / bharat

'ఎంఎస్​ఎంఈలకు 8 ఏళ్లలో 650% పెరిగిన కేటాయింపులు'

author img

By

Published : Jun 30, 2022, 12:43 PM IST

Updated : Jun 30, 2022, 12:53 PM IST

ఎంఎస్​ఎంఈ రంగాన్ని బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాన్ని ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం చేస్తున్న కృషిని గుర్తు చేశారు.

PM Modi inaugurates 'Raising & Accelerating MSME Performance' scheme
'ఎంఎస్​ఎంఈ'ల బలోపేతానికి ఊతం.. 650శాతం పెరిగిన కేటాయింపులు'

దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరింత ఊతం ఇచ్చే మరో కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైజింగ్‌ అండ్‌ యాక్సెలరేటింగ్‌ ఎంఎస్​ఎంఈ పెర్ఫార్మెన్స్‌-రాంప్​(ఆర్​ఏఎంపీ) పేరుతో.. ప్రధాని నరేంద్ర మోదీ నూతన పథకాన్ని ప్రారంభించారు. పథకం అమలుకు 6వేల కోట్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులు, సేవల ఎగుమతులను ప్రోత్సహించేందుకు 'కెపాసిటీ బిల్డింగ్‌ ఆఫ్‌ ఫస్ట్‌ టైమ్‌ ఎంఎస్​ఎంఈ ఎక్స్‌పోర్ట్స్‌- సీబీఎఫ్​టీఈ' అనే మరో పథకాన్ని సైతం ప్రధాని ప్రారంభించారు.

అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ ఎంఎస్​ఎంఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ రంగం కోసం కేటాయించే బడ్జెట్‌ను గత 8ఏళ్లలో 650శాతానికి పైగా పెంచినట్లు ప్రధాని గుర్తుచేశారు. ఫలితంగా గత 8ఏళ్లలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు వార్షిక టర్నోవర్‌ లక్ష కోట్లు దాటిందని, ఖాదీ అమ్మకాలు 4రెట్లు పెరిగాయన్నారు. ఎంఎస్​ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన విధానపరమైన మార్పులను సైతం కేంద్రం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. అటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన వారికి ప్రధాని మోదీ అవార్డులు ప్రదానం చేశారు.

ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత అమర్​​నాథ్ ​యాత్ర.. భారీగా తరలివచ్చిన యాత్రికులు

Last Updated : Jun 30, 2022, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.