ETV Bharat / bharat

PGCIL Diploma Jobs : డిప్లొమా అర్హతతో.. పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 11:32 AM IST

PGCIL Diploma Jobs In Telugu : పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​ (PGCIL) 425 డిప్లొమా ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

PGCIL Diploma Trainee jobs
PGCIL Diploma Jobs

PGCIL Diploma Jobs : ఇంజినీరింగ్​, డిప్లొమాలు చేసి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పవర్​గ్రిడ్ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (PGCIL) 425 డిప్లొమా ట్రైనీ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు
PGCIL Diploma Trainee Category :

  • డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్​) - 344
  • డిప్లొమా ట్రైనీ (సివిల్) - 68
  • డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) - 13

విద్యార్హతలు
PGCIL Diploma Trainee Qualification : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి ఆయా పోస్టులకు అనుగుణంగా ఇంజినీరింగ్, డిప్లొమా చేసి ఉండాలి.

వయోపరిమితి
PGCIL Diploma Age Limit : అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలు మించి ఉండకూడదు.

అప్లికేషన్​ ఫీజు
PGCIL Diploma Application Fee : జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్​ఎం, డిపార్ట్​మెంటల్​ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే వీరు ఎలాంటి అప్లికేషన్​ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
PGCIL Diploma Selection Process : అభ్యర్థులను CBT పద్ధతిలో ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
PGCIL Diploma Trainee Salary : డిప్లొమా ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500 వరకు జీతం అందిస్తారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?
PGCIL Diploma Trainee Online Application Process : ఆసక్తిగల అభ్యర్థులు పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్​సైట్​ https://www.powergrid.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • దరఖాస్తుకు మందు అభ్యర్థులు తమ సర్టిఫికేట్స్​ స్కాన్​ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
  • అభ్యర్థులు కచ్చితంగా ఈ-మెయిల్ ఐడీ, మొబైల్​ నంబర్లను కలిగి ఉండాలి. ఎందుకంటే.. పవర్​గ్రిడ్ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా.. సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ సహా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని మీ ఈ-మెయిల్​, మొబైల్ నంబర్లకే పంపిస్తుంది.
  • అభ్యర్థులు ముందుగా https://www.powergrid.in/ వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి.
  • దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత వివరాలు సహా, ఎడ్యుకేషన్​ క్వాలిఫికేషన్​ వివరాలు నమోదు చేయాలి.
  • తరువాత మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ స్కాన్​ కాపీలను అప్​లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుమును ఆన్​లైన్ లేదా ఆఫ్​లైన్ విధానంలో చెల్లించాలి.
  • చివరిగా దరఖాస్తులోని వివరాలు మరోసారి సరిచూసుకొని, సబ్​మిట్​ చేయాలి.
  • భవిష్యత్​లో రిఫరెన్స్ కోసం అప్లికేషన్​ను ప్రింట్​అవుట్​ తీసుకొని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
PGCIL Diploma Trainee Application Dates :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 1
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్​ 23

ఆసక్తిగల అభ్యర్థులు పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్​సైట్​ https://www.powergrid.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.