ETV Bharat / bharat

వైఎస్సార్​సీపీ పాలనలో ఏపీ అంధకారం - మన భవిష్యత్​ను మనమే నిర్మించుకోవాలి: పవన్‌ కల్యాణ్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 8:29 PM IST

Updated : Dec 21, 2023, 6:28 AM IST

Pawan Kalayn At Nara Lokesh Yuvagalam Public Meeting: వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపుతామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజవకర్గం పోలిపల్లిలో నిర్వహించిన ‘యువగళం-నవశకం’ సభలో పాల్గొన్న పవన్‌ వైఎస్సార్​సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్​సీపీ పాలనలో ఏపీ భవిష్యత్​ అంధకారం అయ్యిందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని మార్చడం ద్వారా మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Pawan Kalayn At Nara Lokesh Yuvagalam Public Meeting
Pawan Kalayn At Nara Lokesh Yuvagalam Public Meeting

కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని అనుకున్నా: పవన్‌ కల్యాణ్

Pawan Kalayn At Nara Lokesh Yuvagalam Public Meeting: చంద్రబాబును అన్యాయంగా జైలులో పెడితే బాధ కలిగిందని, కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని మద్దతు ఇచ్చినట్లు పవన్‌ కల్యాణ్ తెలిపారు. నారా లోకేశ్ ‘యువగళం-నవశకం’ ముగింపు సభలో పవన్ మాట్లాడారు. తాను ఏదో ఆశించి టీడీపీకి మద్దతివ్వలేదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్‌ పేర్కొన్నారు. మార్పు తీసుకువస్తాం, జగన్‌ను ఇంటికి పంపుతామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. జగన్‌ ఎమ్మెల్యేలను మార్చుతున్నారని, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, సీఎం జగన్‌ను మార్చాలని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్‌కు విలువ తెలియదని, ఏదైనా మాట్లాడితే దూషిస్తారు, దాడులు చేయిస్తారని పవన్‌ ఆరోపించారు. తల్లి, చెల్లికి విలువ ఇవ్వని వ్యక్తి, ఆడపడుచులకు ఏం గౌరవం ఇస్తారంటూ పవన్‌ ఎద్దేవా చేశారు.

విజయవంతమైన 'యువగళం-నవశకం" భారీ బహిరంగ సభ

ఇళ్లలో ఉండలేని పరిస్థితులు: వైఎస్సార్​సీపీ నేతలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, కొండలు, కోనలను సైతం ఆక్రమిస్తున్నారని పవన్ వెల్లడించారు. మరో సారి వైఎస్సార్​సీపీ ప్రభుత్వం వస్తే ఎవరూ ఇళ్లలో ఉండని పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. మరో సారి ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావు, ఉపాధి కల్పన జరగదని పవన్‌ వెల్లడించారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందన్న పవన్, వైఎస్సార్​సీపీ వ్యతిరేక ఓట్లు ఒకే వేదికపైకి రావడం సంతోషకరమని తెలిపారు. వైఎస్సార్​సీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని పవన్‌ వెల్లడించారు. వైఎస్సార్​సీపీ పాలనలో ఏపీ అంధకారం అవుతుందన్న పవన్, మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్​సీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలి: చంద్రబాబు

కర్రో, కత్తో పట్టుకోవాల్సి వస్తుంది: ఏపీ భవిష్యత్తు నిలదొక్కుకునే వరకు పొత్తు ఉండాలని పవన్ పేర్కొన్నారు. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలిపారు. టీడీపీతో కలిసి సంయుక్తంగా కార్యక్రమాలు రూపొందిస్తామని పవన్‌ వెల్లడించారు. త్వరలోనే తమ భవిష్యత్తు కార్యాచరణను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఏపీ భవిష్యత్తు నిర్మాణానికి పొత్తు ఉండాలని, అందు కోసం టీడీపీ - జనసేన మైత్రి సుదీర్ఘంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. వైఎస్సార్​సీపీ గూండాలను ఎదుర్కోవటానికి కర్రో, కత్తో పట్టుకోవాల్సి వస్తుందని కేంద్రంలోని పెద్దలకు చెప్పానని పవన్ వెల్లడించారు. తెలుగుదేశంతో పొత్తు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని బీజేపీ నేతలకు వివరించినట్లు పేర్కొన్నారు. తమకు కేంద్రంలోని బీజేపీ పెద్దల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఏపీ నిలదొక్కుకునే వరకూ, పొత్తు సాధ్యమైనంత ఎక్కువకాలం కొనసాగాలని ఆశించారు.

తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు యుద్ధం ఆగదు: నారా లోకేశ్

ఏపీకి రావాలంటే పరిస్థితులు: ఏపీలో పని చేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్​ అధికారులు బయపాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్​సీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని, ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఏపీకి రావాలంటే పరిశ్రమలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయని పవన్ పేర్కొన్నారు. తానకు సైతం లోకేశ్​లా​ పాదయాత్ర చేయాలని ఉందని, వీలుకాని పరిస్థితులు నెలకొన్నాయని పవన్ తెలిపారు. అయితే, లోకేశ్ ప్రజల సమస్యలు వింటూ ముందుకు సాగుతూ యవగళం పాదయాత్ర పూర్తి చేశారని పవన్ తెలిపారు.

సమయం లేదు మిత్రమా - విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం: బాలకృష్ణ

Last Updated : Dec 21, 2023, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.