ETV Bharat / bharat

Pawan Kalyan Varahi Yatra: జగన్ వేల కోట్ల అవినీతి గురించి ప్రధానికి తెలియదా?: పవన్ కల్యాణ్

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 7:18 PM IST

Updated : Oct 1, 2023, 8:07 PM IST

Pawan Kalyan Varahi Yatra: సీఎం జగన్ ఇసుక దోపిడీ, అవినీతి గురించి ప్రధాని దృష్టికి తీసకెళ్దామనుకున్నట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. జగన్ వేల కోట్ల అవినీతి గురించి దేశ ప్రధానికి తెలియదా అని ఆగిపోయినట్లు పవన్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించటమే జనసేన లక్ష్యమని... ఎన్నికల తర్వాత తెదేపా-జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్‌సీ కోసం కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.

Pawan Kalyan Varahi Yatra
Pawan Kalyan Varahi Yatra

Pawan Kalyan Varahi Yatra: రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్‌ ఓటమి ఖాయమని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. తన వారాహి నాలుగో విడత యాత్రను కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పవన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. జగన్‌ పాలనపై ధ్వజమెత్తారు. ఈ పదేళ్లలో జనసేన పార్టీ అనేక దెబ్బలు తిందన్న పవన్... కేవలం ఆశయాలు, విలువల కోసం మేం పార్టీ నడుపుతున్నట్లు తెలిపారు. తాను యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటానని వెల్లడించారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓటు చీలకూడదని పొత్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనకు తన పార్టీ కంటే ఈ రాష్ట్రం ముఖ్యమని పవన్ వెల్లడించారు.

డీఎస్‌సీ వేస్తామని జగన్‌ హామీ ఇచ్చారని.. 30 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. మెగా డీఎస్‌సీ పేరుతో యువతను మోసం చేశారని మండిపడ్డారు. మెగా డీఎస్‌సీ కోరుకుంటున్న ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. కానీ 2018 నుంచి డీఎస్‌సీ ప్రకటన ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎందరికి ఉద్యోగాలు వచ్చాయంటూ పవన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మిన రాష్ట్ర యువత.. ఎంతో విలువైన దశాబ్ద కాలం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలపై స్పందించిన పవన్.. నియామక ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఉన్నాయని ఆరోపించారు.

Pawan Kalyan Varahi Yatra: జగన్ వేల కోట్ల అవినీతి గురించి ప్రధానికి తెలియదా?: పవన్ కల్యాణ్

TDP Balakrishna support for Varahi Yatra: పవన్‌ వారాహి యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం: బాలకృష్ణ

బైజూస్‌ను బత్తాయి జ్యూస్‌లా పిండేశారని పవన్ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో 3.88 లక్షలమంది విద్యార్థులు డ్రాపవుట్ అయ్యారని పవన్ ఆరోపించారు. వైసీపీ చేసిన గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్ సర్వే నిజమా.. కాదా.. అంటూ పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వేలమంది పిల్లలు ఎందుకు చనిపోయారో శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. వైసీపీ చెప్పే అభివృద్ధి ఎక్కడ ఉందంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Janasena Chief Pawan Kalyan Varahi Yatra: అక్టోబర్ 1 నుంచి మొదలు కానున్న పవన్ వారాహి యాత్ర.. పొత్తు ప్రకటన అనంతర యాత్రపై సర్వత్రా ఆసక్తి

ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. జగన్ సేన కౌరవులని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ ఓటమి ఖాయం.. మేం అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారన్న పవన్.. తనకు డబ్బుమీద, నేలమీద ఎప్పుడూ కోరిక లేదని పవన్ వెల్లడించారు. మూడుతరాలుగా రాజకీయాలు చేసే వ్యక్తితో పోరాటం చేస్తున్నానని పవన్ పేర్కొన్నారు. నా నైతిక బలంతోనే ఎంతో బలమైన జగన్‌తో గొడవ పెట్టుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను వెంపర్లాడనని పవన్‌ వెల్లడించారు. ఓట్లు కొనేందుకు తన దగ్గర డబ్బు లేదని పవన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ -జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్ జోస్యం చెప్పారు.

Pawan Varahi Yatra Fourth Phase Begins: నేటి నుంచి పవన్ వారాహి యాత్ర నాలుగో విడత.. జనసైనికులకు మద్దతుగా టీడీపీ శ్రేణులు

Last Updated : Oct 1, 2023, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.