ETV Bharat / bharat

Pawan Kalyan Fire on CM Jagan in Visakhapatnam Meeting: జగన్ నాయకుడు కాదు.. వ్యాపారి.. ఎప్పుడూ డబ్బు పిచ్చే: పవన్ కల్యాణ్

author img

By

Published : Aug 10, 2023, 9:04 PM IST

Updated : Aug 10, 2023, 9:34 PM IST

Pawan Kalyan Fire on CM Jagan in Visakhapatnam Meeting: విశాఖలో జరుగుతున్న వారాహి యాత్రలో సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా పవన్ విరుచుకుపడ్డారు. జగన్ నాయకుడు కాదని.. వ్యాపారి అని విమర్శించారు. పరిశ్రమలు ఇస్తే నాకేంటి.. ఎంత వాటా అని జగన్ అడుగుతారని మండిపడ్డారు.

pawan kalyan comments at visakhapatnam meeting
pawan_kalyan_comments_at_visakhapatnam_meeting

Pawan Kalyan Fire on CM Jagan in Visakhapatnam Meeting: మూడో విడత వారాహి యాత్రలో భాగంగా విశాఖ జగదాంబ కూడలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైసీపీని ఉత్తరాంధ్ర నుంచి తరిమేయాలని అన్నారు. విశాఖను వైసీపీ విముక్తి ప్రాంతంగా చేసే వరకు తాను పోరాడుతానని తెలిపారు. గాజువాకలో ఓడిపోయినందుకు బాధ పడలేదని.. వైసీపీ విశాఖను ఏం చేస్తుందో అని బాధ పడ్డానన్నారు.

No Development in Andhra Pradesh: అభివృద్ధి లేకుండా అప్పులు చేస్తే ప్రయోజనం ఏంటని పవన్ ప్రశ్నించారు. జగన్‌ నాయకుడు కాదు.. వ్యాపారి పేర్కొన్న పవన్.. పరిశ్రమలు ఇస్తే నాకేంటి.. ఎంత వాటా అని జగన్ అడుగుతారని విమర్శించారు. ఒకస్థాయికి వచ్చాక జగన్‌కు.. డబ్బు పిచ్చిగా మారిందన్న పవన్.. ఎంత డబ్బు తింటావు.. రూ.వేల కోట్లు ఏం చేసుకుంటావని అడిగారు. కష్టపడకుండా వచ్చే డబ్బు బానిసలుగా చేస్తుందని మండిపడ్డారు.

Pawan Kalyan About Suswagatham Movie: 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్‌లో సుస్వాగతం సినిమాలో చేశానన్న పవన్.. మళ్లీ 25 ఏళ్ల తర్వాత ప్రజల కోసం.. ఇక్కడే వారాహి సభలో మాట్లాడుతున్నానని అన్నారు. సంస్కృతి, సాహిత్యం నేర్పింది విశాఖ తెలిపారు. ఒకప్పుడు విశాఖ అంటే ప్రశాంత నగరమని.. అలాంటి విశాఖలో గూండా రాజ్యం ఏలుతోంది.. రౌడీలు అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఉన్నంత వరకు విశాఖ వాసులు నిశ్చింతగా ఉండవచ్చని చెప్పారు.

Pawan Kalyan Fire on CM Jagan in Visakhapatnam Meeting: జగన్ నాయకుడు కాదు.. వ్యాపారి.. ఎప్పుడూ డబ్బు పిచ్చే: పవన్ కల్యాణ్

Pawan Kalyan: వైసీపీ దోపిడిని అడ్డుకోవటమే ప్రధాన లక్ష్యం.. జనసేన నేతలకు పవన్​ సూచన

Pawan on Rushikonda: రుషికొండను చెక్కేశారని.. ఎర్రమట్టి దిబ్బలు తవ్వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఓడి నిరాశపడినప్పుడు నాలో జీవం తెచ్చింది విశాఖ అని అన్నారు. ముగ్గురు నిర్మాణ కార్మికులు మంగళగిరి వచ్చి బాధ చెప్పుకున్నారన్న పవన్.. అప్పుడే విశాఖలో నిర్మాణ కార్మికుల తరఫున పోరాటం చేశానని పేర్కొన్నారు. విశాఖ నన్ను గుండెల్లో పెట్టి చూసుకుందని.. నాకు వాలంటీర్ల మీద ద్వేషం లేదని చెప్పుకొచ్చారు. కేవలం అయిదు వేల రూపాయలకు పని చేస్తున్నారు.. మరో రూ.5 వేలు ఇచ్చే ఆలోచన ఉన్నవాడిని అని తెలిపారు. వాలంటీర్ల ద్వారా డేటా తీసుకుని హైదరాబాద్‌లో కంపెనీకి పంపుతున్నారని ఆరోపించారు.

Pawan Kalyan Meeting with Sarpanchs: గ్రామీణ ప్రజల డబ్బును దోచుకుంటున్నారు: పవన్

Pawan Kalyan About Potti Sreeramulu Statues: మహిళలు బలంగా ఎదగాలని తాను ఆలోచించానని.. మహిళలు జగన్‌కు భయపడనక్కర్లేదని తెలిపారు. తాను ప్రాణాలకు తెగించి రాజకీయాలకు వచ్చానన్న పవన్.. రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు విగ్రహాలు లేవు.. రాష్ట్రాన్ని దోచుకున్న వైఎస్ఆర్ విగ్రహాలున్నాయని మండిపడ్డారు. 150 మంది ఎమ్మెల్యేలు పాలించేసుకుంటాం అంటే ఊరుకోమని హెచ్చరించారు.

Pawan Kalyan Fire on YSRCP in Party Meeting: వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి: పవన్

Pawan Comments about Dropouts : అమ్మఒడి వచ్చినా 3 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్‌ అయ్యారన్న పవన్.. కేంద్ర నివేదికల ప్రకారం 50 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. దివాలా తీసిన బైజుస్‌ కంపెనీకి 500 కోట్ల రూపాయలు ఇచ్చారని.. ప్రభుత్వ ఆస్తులను రూ.25 వేల కోట్లకు తాకట్టు పెట్టారని పవన్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే హక్కు ఏ సీఎంకు లేదని అన్నారు.

Janasena Chief Pawan Comments on Jagan Mohan Reddy: జగన్‌కు మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని.. ఒకసారి దోపిడీకి అలవాటు పడి వ్యసనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ మద్యంపై రూ.30 వేల కోట్లు ఆర్జించారని పవన్ ఆరోపించారు. పంచాయతీ నిధులు 1191 కోట్ల రూపాయలను వాలంటీర్లకు జీతాలుగా ఇచ్చారని పవన్ అన్నారు. పంచాయతీల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ కొనేందుకు కూడా డబ్బుల్లేవని విమర్శించారు.

Pawan Kalyan Tweet On KGF కేజీఎఫ్​ గెట్​ రెడి.. జేజీఎఫ్​ వస్తున్నాడు! ఏపీలో బంగారు గనులపై జనసేనాని వ్యంగ్యాస్త్రాలతో కూడిన ట్వీట్

Pawan Kalyan About Panchayat Funds: సర్పంచ్‌ల స్వయంప్రతిపత్తికి తాను కట్టుబడి ఉన్నానన్న పవన్.. పంచాయతీ నిధులు సంపూర్ణంగా సర్పంచ్‌లకే రావాలని తెలిపారు. గ్రామసభలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. పంచాయతీలకు డబ్బులు ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ నిధులపై కోర్టులకు వెళ్లండి.. మీకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దౌర్జన్యాలు చేసి సీఎం అయితే ప్రజలను ఎలా పాలించగలరని.. ఉత్తరాంధ్ర మొత్తాన్ని డంపింగ్‌ యార్డుగా మార్చారని దుయ్యబట్టారు.

Pawan Kalyan About Telangana: జగన్‌ గ్యాంగ్‌ అరాచకాలు తనకు తెలుసని.. జగన్ వర్గం తెలంగాణ భూములు ఎలా దోచుకున్నారో చూశానని పవన్ తెలిపారు. తెలంగాణ రావడానికి జగన్ కూడా ఒక కారణమన్న పవన్.. తెలంగాణలో క్రిమినల్ పాలిటిక్స్ ఉండవని అన్నారు. జగన్ గుంపు అరాచకాలను తట్టుకోలేక తన్ని తగలేశారని.. ఆంధ్రావాళ్లను వెళ్లిపొమ్మన్నారని విమర్శించారు.

Last Updated : Aug 10, 2023, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.