ETV Bharat / bharat

Omicron Variant: దేశం​లో మరో ముగ్గురికి ఒమిక్రాన్

author img

By

Published : Dec 10, 2021, 3:58 PM IST

Updated : Dec 10, 2021, 4:41 PM IST

Omicron cases in Gujarat: దేశంలో మరో ముగ్గురికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయింది. గుజరాత్​లో ఇద్దరు, ముంబయిలో ఒకరికి వైరస్​ సోకింది. మరోవైపు.. మహారాష్ట్రలోని పుణెలో ఒమిక్రాన్ సోకిన ఏడుగురిలో ఐదుగురు వైరస్​ను జయించారు.

omicron
ఒమిక్రాన్

Omicron cases in Gujarat: దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం మరో ముగ్గురికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయింది.

గుజరాత్​లో రెండు..

గుజరాత్​లో మరో ఇద్దరికి ఒమిక్రాన్​ వేరియంట్ సోకింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 3కు చేరింది.

ఒమిక్రాన్ సోకిన వ్యక్తితో దగ్గరగా మెలిగిన ఆ ఇద్దరు వ్యక్తులకు ఇటీవల కరోనా పాజిటివ్​గా తేలింది. వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్​కు పంపగా.. ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. లక్షణాలేవీ లేవని జామ్​నగర్ మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్ ఖరాడి తెలిపారు

ముంబయిలో ఒకటి..

ముంబయిలోని ధారావిలో ఒమిక్రాన్​ కేసు బయటపడింది. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి కొత్త వేరియంట్​ సోకినట్లు నిర్ధరణ అయింది. బాధితుడిని సెవన్​ హిల్స్​ ఆసుపత్రికి తరలించినట్లు బృహన్​ ముంబాయి మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు తెలిపారు.

రాజస్థాన్ టూ దిల్లీ..

Rajasthan Omicron Cases: రాజస్థాన్‌లో ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని కలిసిన ఓ మహిళకు దిల్లీలో కరోనా పాజిటివ్​గా తేలింది. దీనితో ఆమెను లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఒమిక్రాన్ నిర్దరణ పరీక్షల కోసం ఆమె నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్​కు పంపినట్లు తెలిపారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారి జాబితాను రూపొందించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

'ప్రస్తుతం కరోనా సోకిన మహిళ విదేశాల నుంచి రాలేదు. అయినప్పటికీ ఆమె కుటుంబంలోని 17 మంది సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచాం' అని ఓ అధికారి వెల్లడించారు.

గత ఆదివారం దిల్లీలో మొదటి ఒమిక్రాన్ కేసు వెలుగుచూసింది.

వారు సేఫ్..

Omicron cases in Maharashtra: పుణెలో ఒమిక్రాన్ సోకిన ఏడుగురిలో ఐదుగురు కోలుకున్నట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. జిల్లాలోని పింప్రి చించ్వాడా ప్రాంతంలో ఉన్న ఆరుగురిలో నలుగురు, పుణె నగరంలో ఓ వ్యక్తికి నెగటివ్​గా తేలింది. 'మొత్తంగా ఏడుగురి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది' అని పవార్ తెలిపారు.

అర్హులైన వారందరికీ 100 శాతం కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ను అందించామని.. ఇప్పటివరకు 1.38 కోట్ల డోసులు పంపిణీ చేశామని ఓ సమావేశంలో వెల్లడించారు పవార్. గత 10 రోజులుగా వ్యాక్సినేషన్‌ వేగం పెంచామని తెలిపారు.

"విదేశాల నుంచి పుణెకు వచ్చిన 4,500 మంది ప్రయాణికుల జాబితా అందింది. వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటున్నాం."

--అజిత్ పవార్

ఇవీ చదవండి:

Last Updated : Dec 10, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.