ETV Bharat / bharat

288కు చేరిన రైలు ప్రమాద మృతుల సంఖ్య.. క్షతగాత్రులకు ఉచిత చికిత్స.. వారికి మోదీ థ్యాంక్స్​

author img

By

Published : Jun 3, 2023, 7:12 AM IST

Updated : Jun 4, 2023, 6:35 AM IST

odisha train accident news
odisha train accident news

21:00 June 03

ఇప్పటి వరకు 160 మృతదేహాలు ఎవరివో గుర్తించలేదని, వాటన్నిటినీ భువనేశ్వర్‌ తరలిస్తామని ఒడిశా చీఫ్‌ సెక్రెటరీ తెలిపారు. మరోవైపు రైలు శకలాల మధ్యలో ఇంకేమైనా మృతదేహాలు ఉన్నాయేమోనని గాలిస్తున్నారు.

21:00 June 03

రైలు ప్రమాద ఘటనలో బాధితులకు సాయం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. మృతుల కుటుంబాలకు తమ వంతు సాయాన్ని అందించాలని రాజకీయ పార్టీలను కోరారు.

20:12 June 03

ఒడిశా రైలు దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు రైల్వేశాఖ ఆదేశించింది. ఇప్పటికే ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన రైల్వేశాఖ.. ప్రధాని సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం గమనార్హం. మరోవైపు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదురవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

20:12 June 03

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు లోకో పైలట్లు, ఇద్దరు గార్డులు గాయపడ్డారు. వీరంతా ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. గూడ్స్‌ రైలు లోకో పైలట్‌, గార్డ్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. "కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకోపైలట్‌, అదే ట్రైన్‌లోని గార్డు గాయపడ్డారు. బెంగళూరు-హవ్‌డా సూపర్‌ ఫాస్ట్‌ రైలులోని గార్డుకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి" అని రైల్వే అధికారులు తెలిపారు.

18:53 June 03

ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ 288 మంది ప్రాణాలు కోల్పోయారు. 750 మందికిపైగా.. గాయపడ్డారు. దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత దారుణ ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ దుర్ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పొరబాటుగా లూప్‌లైన్‌లోకి మారడం వల్లే ఈ పెను విషాదం జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక వెల్లడించింది

17:12 June 03

  • ఒడిశా: కటక్‌లోని ఆస్పత్రికి చేరుకున్న ప్రధాని మోదీ
  • కటక్‌లో రైలు ప్రమాద బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ
  • క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకుంటున్న మోదీ
  • బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ప్రధాని సూచన

16:34 June 03

ఒడిశా బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటనాస్థలంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించారు. భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌లో బాలాసోర్‌ చేరుకున్న ప్రధాని... రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, విద్యామంత్రి ధర్మేంద్రప్రదాన్‌తో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు. రైలు ప్రమాద ఘటన గురించి అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి ఆరా తీశారు.

కటక్‌కు బయల్దేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని పరామర్శించనున్నారు.

15:44 June 03

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలోని బాలేశ్వర్​కు చేరుకున్నారు. ఆర్మీ ప్రత్యేక విమానంలో ఆయన బాలేశ్వర్​కు విచ్చేశారు. ఘటనాస్థలిని ఆయన పరిశీలించనున్నారు. అనంతరం ఉన్నతస్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

15:18 June 03

  • ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక వెల్లడి
  • సిగ్నల్‌ లోపం కారణంగానే ప్రమాదం జరిగింది: రైల్వే శాఖ
  • లూప్‌లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును కోరమాండల్‌ ఢీకొట్టింది: రైల్వే శాఖ
  • మెయిన్‌ లైన్‌పై వెళ్లేందుకే కోరమాండల్‌కు సిగ్నల్‌ ఇచ్చారు: రైల్వేశాఖ
  • కోరమాండల్‌ రైలు మాత్రం పొరపాటున లూప్‌లైన్‌లోకి వెళ్లింది: రైల్వేశాఖ

14:49 June 03

కోరమాండల్‌లో 178 మంది ఏపీ ప్రయాణికులు

  • కోరమాండల్‌లో 178 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారు: వాల్తేరు డీఆర్‌ఎం
  • వందమందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నారు: వాల్తేరు డీఆర్‌ఎం
  • జనరల్‌ బోగీలో ఎందరు ఏపీ ప్రయాణికులున్నారో చూడాలి: డీఆర్‌ఎం
  • బాలాసోర్‌ నుంచి ప్రత్యేక రైలు మరో 2 గంటల్లో విశాఖ రానుంది: డీఆర్‌ఎం
  • విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలాసోర్‌ వెళ్తోంది: డీఆర్‌ఎం
  • మరమ్మతుల కోసం బాలాసోర్‌లో విశాఖ బృందం ఉంటుంది: వాల్తేరు డీఆర్‌ఎం
  • యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎందరు ఏపీ వాసులున్నారో తేలాల్సి ఉంది: డీఆర్‌ఎం

14:30 June 03

ఒడిశా రైలు ప్రమాద స్థలానికి బయలుదేరిన ప్రధాని మోదీ

  • ఒడిశా రైలు ప్రమాద స్థలానికి బయలుదేరిన ప్రధాని మోదీ
  • ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్న ప్రధాని మోదీ
  • కటక్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న ప్రధాని

12:16 June 03

ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయని రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు.

10:28 June 03

  • ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సమీక్ష
  • ప్రమాదం, సహాయ చర్యలపై అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష

09:08 June 03

ఒడిశా రైలు ప్రమాదంలో 278కి చేరిన మృతుల సంఖ్య

  • ఒడిశా రైలు ప్రమాదంలో 278కి చేరిన మృతుల సంఖ్య
  • ఒడిశా: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌
  • క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌
  • ప్రస్తుతం సహాయచర్యలపై పూర్తిగా దృష్టి సారించాం: అశ్వినీ వైష్ణవ్‌
  • ఘటనాస్థలంలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు: అశ్వినీ వైష్ణవ్‌
  • రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: అశ్వినీ వైష్ణవ్‌
  • ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశాం: అశ్వినీ వైష్ణవ్‌
  • కమిటీ నివేదిక వచ్చాక ప్రమాద కారణాలు తెలుస్తాయి: అశ్వినీ వైష్ణవ్‌

08:20 June 03

  • ఘటనాస్థలిలో 200 అంబులెన్స్‌ సిద్ధంగా ఉంచాం: ఒడిశా సీఎస్‌
  • బాధితులను పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాం: ఒడిశా సీఎస్‌
  • ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రమాద స్థలంలోనే ఉంది: ఒడిశా సీఎస్‌

07:26 June 03

18 రైళ్లు రద్దు

ఒడిశాలో రైలు ప్రమాద ఘటనతో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను రైల్వే శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో ఏడు రైళ్లను మళ్లించారు. హావ్‌డా-పూరీ, హావ్‌డా-బెంగళూరు, హావ్‌డా-చెన్నై మెయిల్‌, హావ్‌డా-సికింద్రాబాద్‌, హావ్‌డా-హైదరాబాద్‌, హావ్‌డా-తిరుపతి, హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌, హావ్‌డా-సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌, సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు-గువాహటి రైలును విజయనగరం, టిట్లాగఢ్‌, జార్సుగుడా, టాటానగర్‌ మీదుగా మళ్లించారు. ఖరగ్‌పుర్‌ డివిజన్‌లోని చెన్నై సెంట్రల్‌-హావ్‌డా రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా-షాలిమార్‌, సికింద్రాబాద్‌-షాలిమార్‌ వారాంతపు రైళ్లను కటక్‌, అంగోల్‌ మీదుగా దారి మళ్లించారు.

06:58 June 03

Odisha Train Accident : 288కు చేరిన మృతుల సంఖ్య.. ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన మోదీ

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం, 233 మందికి పైగా మృతి

ప్రమాదంలో 900 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు

ఒడిశా: బాలేశ్వర్‌ సమీపంలో 3 రైళ్లు ఢీకొని ప్రమాదం

ఒడిశా: బాలాసోర్‌ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్‌ వద్ద ప్రమాదం

పట్టాలు తప్పిన బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

పట్టాల పక్కన పడిన బెంగళూరు-హౌవ్‌డా ఎక్స్‌ప్రెస్‌ బోగీలు

బెంగళూరు-హావ్‌డా బోగీలను ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తా

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన మరో గూడ్స్‌ రైలు

ఒడిశా: ఘటనాస్థలంలో ముమ్మరంగా సహాయ చర్యలు

సహాయ చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది

సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న రైల్వేశాఖ ఉన్నతాధికారులు

Last Updated : Jun 4, 2023, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.