ETV Bharat / bharat

ఉగ్ర దాడిలో భాజపా సర్పంచ్ దంపతులు మృతి

author img

By

Published : Aug 9, 2021, 5:25 PM IST

Updated : Aug 9, 2021, 8:06 PM IST

జమ్ముకశ్మీర్​లో ఓ భాజపా సర్పంచ్​, ఆయన భార్యపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Terrorists fired bullets at a couple
ఉగ్రవాదుల కాల్పులు

జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ భాజపా సర్పంచ్​, ఆయన భార్యపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

Terrorists fired bullets at a couple
ఘటనాస్థలిలో మోహరించిన భద్రతా బలగాలు

మృతులు కుల్గాం జిల్లా భాజపా కిసాన్​ మోర్చా అధ్యక్షుడు గులామ్ రసూల్​ దార్​, ఆయన భార్య అని ఓ పోలీస్​ అధికారి చెప్పారు. అనంత్​నాగ్​ పట్టణంలో వీరిపై దాడి జరిగిందని వివరించారు. తీవ్రగాయాలైన వారిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందినట్లు పేర్కొన్నారు.

Terrorists fired bullets at a couple
దంపతులపై కాల్పుల జరిగిన ప్రదేశానికి చేరుకున్న అంబులెన్సు, పోలీసులు
Terrorists fired bullets at a couple
ఘటనాస్థలికి చేరుకున్న అంబులెన్సు

కుల్గామ్ జిల్లా​ రేద్వానీకి చెందిన గులామ్ రసూల్​ దార్​.. ఆ గ్రామ సర్పంచ్​గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అనంత్​నాగ్​లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

'తగిన బుద్ధి చెబుతాం..'

సర్పంచ్​ రసూల్ దార్​, ఆయన భార్యపై ఉగ్రవాదుల దాడి ఘటనను జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ ఖండించారు. ఈ పిరికిపంద చర్యకు పాల్పడినవారికి త్వరలోనే తగిన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు.

'తప్పించుకోలేరు..'

సర్పంచ్​ రసూల్ దార్ హత్య ఘటనను భాజపా ఖండించింది. ఈ దాడిని పిరికిపింద చర్యగా అభివర్ణించింది. పోలీసుల చెర నుంచి నిందితులు తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది.

"పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్​లో మరోసారి రక్తపాతానికి పాల్పడ్డారు. మృతిచెందిన భాజపా కిసాన్​ మోర్చా నేత, ఆయన భార్య ఆగస్టు 5న ఆర్టికల్​ 370 రద్దు రెండో వార్షికోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరంగ జెండాను ఎగరవేశారు. దేశం కోసం వారు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాలను వృథా కావు."

-రవీందర్​ రైనా, కశ్మీర్​ భాజపా అధ్యక్షుడు

దేశ భద్రతా బలగాలు..ఈ దాడి కారకులను పట్టుకునేందుకు వేట ప్రారంభించాయని రవీందర్ రైనా చెప్పారు. తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటారని అన్నారు.

ఇదీ చూడండి: భారత్​పై ఉగ్ర కుట్ర- డ్రోన్​ ద్వారా 'టిఫిన్ బాక్స్' బాంబ్!

Last Updated : Aug 9, 2021, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.