ETV Bharat / bharat

శబరిమల ఆలయంలో అనూహ్య సమస్య- యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్న అధికారులు!

author img

By

Published : Jul 26, 2022, 6:23 PM IST

Ayyappa temple water leakage: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయ గర్భగుడిలో నీరు లీకవుతోంది. బంగారు తాపడం చేసిన పైకప్పు నుంచి నీరు లీకవుతున్నట్లు గుర్తించిన ట్రావన్​కోర్​ దేవస్థాన అధికారులు మరమ్మత్తు పనులను ప్రారంభించారు.

shabarimale temple leakage
shabarimale temple leakage

Ayyappa temple water leakage: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో అనూహ్య సమస్య తలెత్తింది. గర్భగుడిలోని బంగారు తాపడం చేసిన పైకప్పు నుంచి నీరు లీకవుతోంది. ఈ లీకేజీని గుర్తించిన ట్రావన్​కోర్​ దేవస్థాన అధికారులు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. దేవస్థాన బోర్డు సభ్యుడు మాట్లాడుతూ.. ఇది చిన్న సమస్యేనని.. గర్భగుడిలో ఎడమవైపు ద్వారపాలకుల విగ్రహాల వద్ద లీకేజీని గుర్తించామని తెలిపారు.

ఈ విషయంపై ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరుకు సమాచారం ఇచ్చామని.. ఆయన మరమ్మతులకు అనుమతి ఇచ్చారని దేవస్థాన బోర్డు సభ్యుడు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 3న బంగారు తాపడం పూసిన పైకప్పును తెరిచి పరిశీలిస్తామని చెప్పారు. ఆ తర్వాతే లీకేజీ తీవ్రత తెలుస్తుందని చెప్పారు. ఈ మరమ్మతుకు అయ్యే ఖర్చునంతా ట్రావన్​కోర్​ దేవస్థానమే భరిస్తుందని వెల్లడించారు.

ఇవీ చదవండి: ఒకేసారి స్టేషన్​లోని 66 మంది పోలీసులు బదిలీ.. కారణమిదే..

మూడు రోజుల క్రితమే పెళ్లి.. కూతురు, అల్లుడిని కొడవలితో నరికి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.