ETV Bharat / bharat

యాసిడ్ దాడితో అంధత్వం.. టెన్త్​లో 95% మార్కులతో స్కూల్ టాప్.. టార్గెట్ ఐఏఎస్​!

author img

By

Published : May 14, 2023, 7:05 PM IST

Updated : May 14, 2023, 8:58 PM IST

యాసిడ్​ దాడిలో చూపు కోల్పోయినప్పటికీ సీబీఎస్​ఈ టెన్త్​ బోర్డు పరీక్షల్లో ఏకంగా 95.2 శాతం మార్కులతో స్కూల్​ టాపర్​గా నిలిచింది ఓ బాలిక. పంజాబ్ చండీగఢ్​కు చెందిన 15 ఏళ్ల విద్యార్థిని స్ఫూర్తిదాయక కథను మనమూ తెలుసుకుందామా..

Acid Attack Survivor Khafi
'పది'లో 95 శాతం మార్కులతో ప్యూన్​ కుమార్తె సత్తా.. ఐఎస్​ఏ కావడమే లక్ష్యం​!

లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండాలే కానీ అందుకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించింది పంజాబ్ చండీగఢ్​కు చెందిన 15 ఏళ్ల విద్యార్థిని కాఫీ. యాసిడ్​ దాడికి గురై చూపు కోల్పోయినా.. చదువుపై మక్కువతో ముందుకు సాగింది. సెంట్రల్​ సిలబస్​ అయిన సీబీఎస్​ఈ 10వ తరగతి బోర్డ్ పరీక్షల్లో ఏకంగా 95.2 శాతం మార్కులు సాధించి స్కూల్ టాపర్​గా నిలిచింది.

"3 ఏళ్లు ఉన్నప్పుడు పక్కింటి వ్యక్తి నా కూతురిపై యాసిడ్​ దాడి చేశాడు. దీంతో ఆమె చూపు కోల్పోయింది. ఎలాగైనా తనకు తెప్పించాలనే ఆశతో ట్రీట్​మెంట్​ కోసం సుమారు 6 ఏళ్లపాటు హైదరాబాద్ సహా అనేక చోట్ల ఉన్న ఆస్పత్రులకు తీసుకెళ్లాను. కానీ, ఫలితం లేదు. ఇక నా కూతురికి చూపు రావడం కష్టమని వైద్యులు చెప్పారు. మధ్యలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినా కొందరి సలహాతో నా కూతురిని ఇంతవరకు చదవించగలిగాను. అందరి తల్లిదండ్రులను కోరేది ఒక్కటే.. పిల్లలను నిరుత్సాహపరచకండి. వాళ్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకారం అందించండి. నా కూతురు ఐఏఎస్​ కావాలని అనుకుంటోంది. అందుకోసం నా పూర్తి సహకారం ఆమెకు ఉంటుంది."

- పవన్​, కాఫీ తండ్రి.

Acid Attack Survivor Khafi
బ్రెయిలీ లిపిలో పాఠాలు చదువుతున్న కాఫీ

ప్యూన్​ ఉద్యోగం చేసుకుంటూ..
సచివాలయంలో ప్యూన్​ ఉద్యోగం చేస్తూనే కూతురిని సీబీఎస్​ఈ సిలబస్​ పాఠశాలలో చేర్పించాడు పవన్​. కాఫీ చదువుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాడు. తల్లి కూడా అన్ని రకాలుగా తోడుగా నిలిచింది. స్నేహితులు, ఉపాధ్యాయులు కాఫీని ఎల్లప్పుడూ ప్రోత్సాహించేవారు. తనకు చూపులేదని.. ఎలా చదవగలనని ఎన్నడూ నిరుత్సాహపడలేదు కాఫీ. ఇంతమంది ప్రోద్బలంతో కష్టపడి చదివింది. ఎంతో కష్టంగా భావించే సెంట్రల్​ సిలబస్​ ఎగ్జామ్స్​లో ఏకంగా 95 శాతానికి పైగా మార్కులతో పాసయి పాఠశాలలో టాపర్​గా నిలిచింది.

"నా కూతరు ఐఏఎస్​ కావాలని అనుకుంటోంది. కచ్చితంగా తను ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందనే పూర్తి నమ్మకం నాకుంది. నేను బతికున్నంత కాలం తనకేం కావాలన్నా దగ్గరుండి అన్నీ సమకూరుస్తాను. తల్లిగా అది నా బాధ్యత. బేటీ బచావో బేటీ పడావో అని మోదీ అన్నారు. ఆయన చెప్పినట్లుగానే మా కూతురిని కాపాడుకున్నాము, చదివించుకుంటున్నాము. అందరి తల్లులను నేను కోరేది ఒక్కటే.. పిల్లలను చదివించండి. వారి లక్ష్యాలను చేరుకోవడానికి తోడ్పాటు అందించండి."

- కాఫీ తల్లి

భవిష్యత్​లో ఐఏఎస్​ అధికారి​ కావడమే తన ముందున్న లక్ష్యమని అంటోంది కాఫీ. తనకు జియాగ్రఫీ సబ్జెక్ట్​ అంటే చాలా ఇష్టమని.. తదుపరి తరగతుల్లో ఆర్ట్స్​ స్ట్రీమ్​ను ఎంచుకుంటానని తెలిపింది.

Acid Attack Survivor Khafi
యూట్యూబ్​లో పాఠాలు వింటున్న కాఫీ

"సీబీఎస్​ఈ టెన్త్​ పరీక్షల్లో​ నాకు 95.2% మార్కులు వచ్చాయి. స్కూల్​లో టాపర్​గా నిలిచాను. మానసికంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి గొప్ప సహకారం అందింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల​ నుంచి. ఏదైనా సందేహం అడిగితే వెంటనే వారు నివృతి చేసేవారు. సెలవుల్లోనూ ఆన్​లైన్​ క్లాస్​లు పెట్టి, మా డౌట్స్​ క్లారిఫై చేసేవారు. మొత్తంగా ప్రతి ఒక్కరి నుంచి మద్దతు​ అందింది. నేను రోజు కనీసం 5 నుంచి 6 గంటల వరకు చదువుతాను. సాధారణ విద్యార్థుల కోసం మార్కెట్​లో అనేక రకాల గైడ్స్​, సాంపుల్​ పేపర్స్ అందుబాటులో ఉంటాయి. అయితే మా లాంటి వాళ్లకు వాటితో ఉపయోగం ఉండదు. ఇది కాస్త ఇబ్బందికరమే. కానీ, యూట్యూబ్​ ద్వారా మాకు సిలబస్​కు సంబంధించి దాదాపు అన్ని పాఠాలు ఆన్​లైన్​లో ఆడియో, వీడియో రూపంలో అందుబాటులో ఉంటాయి. ఇవి నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఐఏఎస్​ ఆఫీసర్​ అవ్వాలనేది నా కల. ఇందుకోసం నేను ఆర్ట్స్​ స్ట్రీమ్​ను ఎంచుకుంటాను."

- కాఫీ, విద్యార్థిని

Last Updated : May 14, 2023, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.