ETV Bharat / bharat

A key meeting on Polavaram : పోలవరంపై సమీక్ష... '2025 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం' : ఈఎన్​సీ

author img

By

Published : Jun 1, 2023, 6:58 PM IST

A key meeting on the latest situation in Polavaram : పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితిపై కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ముగిసింది. 2025 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే లక్ష్యమన్న ఈఎన్​సీ.. ఏడాది ముందుగానే పూర్తి చేసేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తుకు సంబంధించి ఆర్ అండ్​ ఆర్ నిధులు ఇవ్వాలని కోరగా.. కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు ఈఎన్​సీ వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat

A key meeting on the latest situation in Polavaram : పోలవరం ప్రాజెక్టు పనుల తాజా పరిస్థితిపై కేంద్ర జలశక్తి శాఖ దిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పనుల పురోగతి, సహాయ, పునరావాస కార్యక్రమాల అమలు సహా మరో ఆరు అంశాలపై కీలక సమీక్ష నిర్వహించారు. అనంతరం.. భేటీ వివరాలను నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్​హాక్ నిధుల కింద రూ.17,414 కోట్లు అడిగిందని తెలిపారు. దీనిపై కేంద్రం బదులిస్తూ.. పరిశీలిస్తామని చెప్పిందని వెల్లడించారు. 2025 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం కాగా, ఏడాది ముందే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఈఎన్​సీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్‌ అండ్ ఆర్ నిధులు ఇవ్వాలని కోరగా.. కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఈఎన్‌సీ నారాయణ రెడ్డి తెలిపారు.

విజయ్​ దేవరకొండతో రిలేషన్​.. వైరల్​గా సమంత​ పోస్ట్​!​

అంచనాల్లో అంకెల గారడీ.. పోలవరం పనుల్లో తొలిదశ అంచనాలను జగన్ సర్కార్ భారీగా పెంచడంపై అంకెల గారడీ కనిపిస్తోంది. ఏడాదిన్నర కిందటి అంచనాలకు ఇప్పటికీ 5వేల కోట్ల రూపాయలకు పైగా పెరగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌లో ఎంతో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని 1,427 మీటర్ల పొడవు, కొన్నిచోట్ల 300 అడుగుల లోతులో గతంలో 467 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. వరదలకు దెబ్బతిన్న చోట పాక్షికంగా డయాఫ్రంవాల్ నిర్మించనుండగా.. ఏకంగా రూ.311 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇది మొత్తం నిర్మాణంలోని 70శాతం నిధులకు సమానం కావడం గమనార్హం.

గీతా ఆర్ట్స్​ నుంచి నాలుగు భారీ ప్రాజెక్ట్స్​.. ఆ దర్శకుడితో రూ.200కోట్ల సినిమా

తొలిదశలో 5వేల కోట్లు అదనం.. రాష్ట్ర ప్రభుత్వం 2022 జనవరిలో రూ.10,911 కోట్లతో కేంద్రానికి తొలిదశ అంచనాలు సమర్పించినా కొలిక్కి రాలేదు. తిరిగి కేంద్ర జల్‌శక్తి శాఖ కోరిన మేరకు మే నెలలో 16,952 కోట్ల రూపాయలతో అంచనాలు పంపారు. అదనంగా పనులు, భూసేకరణ, పునరావాసంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2017-18లో టీడీపీ ప్రభుత్వం 55 వేల కోట్లతో రెండో డీపీఆర్‌ సమర్పించగా.. కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ 2019 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. కానీ, జగన్‌ ప్రభుత్వం రివైజ్డు కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేసి 47,725 కోట్లకు ఆమోదం తెలిపింది. కానీ, కేంద్ర ప్రభుత్వం 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేస్తే ఎంత ఖర్చవుతుందో అంచనాలు తయారు చేసి పంపాలని కోరగా.. జగన్‌ సర్కార్‌ సైతం అదే కోణంలో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏళ్ల తరబడి పోలవరం డీపీఆర్ పై కసరత్తు చేయడం.. రెండు కీలక కమిటీలు సైతం ఆమోదం తెలిపాక పక్కన పెట్టి తొలిదశ నిధులంటూ సాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రానికి సమర్పించిన తొలి దశ అంచనాల్లో ప్రధాన డ్యాం, కాల్వల పూర్తికి రూ.6,593 కోట్లు, ప్రధాన డ్యాంలో కోత, పాక్షిక డయాఫ్రం వాల్‌ పనులకు రూ.2వేల కోట్లు అవసరమని లెక్కగట్టారు. ఇతర పనులు, నిర్వహణ ఖర్చులకు మరో రూ. 945 కోట్లు, భూసేకరణ, పునరావాసం కోసం రూ.7,394 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు.

నిఖిల్ చేతిలో 'సెంగోల్​'.. ఈ యంగ్ హీరో టార్గెట్​ వారేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.