ETV Bharat / bharat

భార్యపై అనుమానం.. నాలుగేళ్ల పాటు బంధించి చిత్రహింసలు

author img

By

Published : Apr 13, 2022, 12:23 PM IST

Beed Husband Harassment: భార్యపై అనుమానంతో నాలుగేళ్లుగా ఇంట్లోనే ఉంచి నరకం చూపించాడు ఓ కిరాతక భర్త. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్​లో జరిగింది. సామాజిక కార్యకర్తలు, పోలీసులు చొరవతో మహిళకు భర్త చెర నుంచి విముక్తి కలిగింది.

Beed Husband  Harassment
నాలుగేళ్లుగా బంధీగా ఉన్న మహిళ

Beed Husband Harassment: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి 4 ఏళ్ల పాటు ఆమెను బందీగా ఉంచాడు. నిత్యం భార్యను కొట్టి హింసిస్తూ.. పిల్లలను కూడా భయాందోళనలకు గురి చేసేవాడు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని బీడ్​లో జరిగింది. అయితే ఎట్టకేలకు బాధితురాలికి విముక్తి కలిగింది. సామాజిక కార్యకర్తలు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను విడిపించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Beed Husband Harassment
నాలుగేళ్లుగా బంధీగా ఉన్న మహిళ

ఇదీ జరిగింది: బీడ్‌లోని జాల్నా రోడ్డు సమీపంలో నివసించే రూపాలి, మనోజ్ కిన్హికర్‌కు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన రెండు మూడేళ్లు వరకు బాాగానే ఉన్న ఆమె భర్త.. ఆ తర్వాత రూపాలిపై అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టాడు. ఈ అనుమానం కారణంగానే ఆమెను ఉద్యోగం మాన్పించేశాడు. బాధితురాలిని కొట్టి మానసికంగా వేధించేవాడు. చివరకు బాధితురాలి తండ్రి చనిపోయిన సమయంలో కూడా ఆమెను అంత్యక్రియలకు హాజరు కానివ్వలేదు. భర్త హింస కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించి వృద్ధురాలిలా మారిపోయిందని స్థానికులు పేర్కొన్నారు. బాధితురాలిని చికిత్స కోసం బీడ్​ జిల్లా ఆసుపత్రికి తరలించామని.. నిందితుడిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: అన్న కుటుంబాన్ని హతమార్చిన తమ్ముడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.