ETV Bharat / snippets

పోలింగ్​ పూర్తైనా ఆగని వైఎస్సార్సీపీ అరాచకాలు - టీడీపీ నేత ఇంటిపై దాడికి యత్నం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 5:24 PM IST

ysrcp leaders attack on tdp leaders
ysrcp leaders attack on tdp leaders (ETV Bharat)

YSRCP Leaders Attack on TDP Leaders in Anantapur District: ఎన్నికలు పూర్తైనా వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అనంతపురం జిల్లా సింగనమల మండలం చిన్న జాలాపురాంలో తెలుగుదేశం నాయకుడి ఇంటిపై వైసీపీ నాయకుడు దాడికి యత్నించారు. గతంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులును మార్చాలంటూ అసమ్మతి నాయకులతో కలిసి పని చేసిన వైసీపీ మాజీ మండల కన్వీనర్ పట్నం నగేష్ గతంలో కూడా వారు అసమ్మతి వర్గం సమావేశానికి వెళ్లడంతో తన తోటలో నిప్పుపెట్టిన దుండగులు అప్పుడు కూడా పోలీసులను ఆశ్రయించాడు. ఇప్పుడు ఇంటి పైకి వచ్చి బెదిరించాడన్నారు. వైసీపీ నాయకుడు శ్రీరామ్ రెడ్డి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సమీప బంధువు. ఆమె అండదండలతోనే నగేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరాడని నీ అంత చూస్తానంటూ నగేష్ ఇంటిపైకి వెళ్లి శ్రీరామ్​రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.