మట్టి మాఫియాపై ఫిర్యాదును ఎందుకు పట్టించుకోలేదు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను నిలదీసిన అనుచరుడు - YSRCP MLA Kaile Anil Kumar

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 7:20 AM IST

thumbnail

YSRCP Leader Fired on MLA Kaile Anil Kumar Krishna District : ఎన్నికల ప్రచారంలో కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్​ కుమార్​కు చేదు అనుభవం ఎదురైంది. మట్టి అక్రమ తవ్వకాలపై సొంతపార్టీ నాయకులే నిలదీసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కైలే అనిల్ రెండు రోజుల క్రితం పామర్రు మండలం పెదమద్దాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఉన్న అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించగా స్థానిక వైఎస్సార్సీసీ నాయకుడు యారం ప్రసాద్​ అడ్డుకున్నారు. మట్టి మాఫియా విషయంలో తాను ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదంటూ బహిరంగంగా నిలదీశారు. తనకు సమాధానం చెప్పాకే అంబేడ్కర్​ విగ్రహానికి దండ వేయాలంటూ పట్టుపట్టారు.

"మా చెరువు తవ్వేసి మట్టి ఎత్తుకుపోతున్నారని మీకే చెప్పాను. కానీ మీరేమన్నారు. సంపాదించుకునే వాళ్లను చూసి ఎందుకు ఏడుస్తున్నావెందుకు అంటూ నాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాకే అంబేడ్కర్ విగ్రహానికి దండలు వేయండి" -యారం ప్రసాద్​, వైఎస్సార్సీపీ నాయకుడు

యారం ప్రసాద్​ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యే అనిల్ దిక్కులు చూస్తూ నిలబడిపోవడం గమనార్హం. ఈ నిలదీతను వైఎస్సార్సీపీ నాయకులే వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ప్రస్తుతం వైరల్​గా మారింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.