అర్ధరాత్రి టీడీపీ నేత కారును తగలబెట్టిన దుండగులు - పాత కక్షలేనా ! - Car on Fire in Prakasam

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 1:44 PM IST

thumbnail
పెట్రోల్ పోసి కారును తగలబెట్టిన దుండగులు - ఎవరైనా కక్షకట్టి దగ్ధం చేశారా? (ETV Bharat)

Unknown People Set Car on Fire in Prakasam District : ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాలెంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడి కారును దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. చిగురుపాటి శేషగిరి ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్నకారును అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఈ విషయాన్ని గమనించిన ఆయన సిబ్బంది మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు. మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శేషగిరి తెలుగుదేశం పార్టీలో పని చేస్తూనే లారీ యజమానుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. కారు దగ్ధం ఘటనపై కొండెపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి ఎస్పీకి ఫోన్ చేసి రాజకీయ కోణంలోనూ దర్యాప్తు నిర్వహించాలని కోరారు. వ్యాపార లావాదేవీల కారణంగా ఎవరైనా కక్షకట్టి కారును దగ్ధం చేశారా? లేదా రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు కోసం జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక పోలీసు బృందం సింగరాయకొండకు వెళ్లింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.