ఇసుక అక్రమ ర‌వాణా- జమ్మలమడుగు ఎమ్మెల్యే బంధువుపై కేసు - ysrcp leaders in sand mining

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 12:23 PM IST

thumbnail
ఇసుక అక్రమ ర‌వాణా- జమ్మలమడుగు ఎమ్మెల్యే బంధువుపై కేసు (ETV Bharat)

Two Arrested for Illegal Transportation of Sand in YSR District : వైఎస్సార్ కడప​ జిల్లాలో వైఎస్సార్సీపీ నేతల అండ‌దండ‌ల‌తో ఇసుక అక్రమ ర‌వాణా జోరుగా సాగుతోంది. పెన్నాన‌ది నుంచి అక్రమంగా తవ్వకాలు చేసి లారీల ద్వారా ఇసుకను జిల్లాలు దాటించేస్తున్నారు. ఇసుక అక్రమ ర‌వాణాలో ప్రమేయం ఉందంటూ జమ్మల‌మ‌డుగు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స‌మీప బంధువు శివారెడ్డి సహా ఆరుగురిపై ప్రొద్దుటూరులో కేసు న‌మోదైంది. వీరందరూ ముఠాగా ఏర్పడి ఎర్రగుంట్ల మండ‌లం ఆంజ‌నేయ‌పురం సమీపంలోని పెన్నాన‌ది నుంచి ఇసుకను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు.

పోట్లదుర్తికి చెందిన శివారెడ్డి, ఆంజ‌నేయ‌పురానికి చెందిన శివ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా త‌ర‌లించి నిల్వ చేస్తున్నారు. ఒక్కో లారీ ఇసుకను 20 నుంచి 25 వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే  ఆంజ‌నేయ‌పురం నుంచి ఇసుక‌ను లారీల్లో నింపి ప్రకాశం జిల్లా గిద్దలూరు తీసుకెళ్తుండా ప్రొద్దుటూరు పాల‌కేంద్రం వ‌ద్ద రెండు లారీల‌ను పోలీసులు సీజ్ చేశారు. శివారెడ్డి, శివ‌తోపాటు లారీల య‌జ‌మానులు తిరుమ‌ల రెడ్డి, వెంక‌టేశ్వరరెడ్డి, మ‌రో ఇద్దరు డ్రైవ‌ర్లపై కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.