మార్చి 2న నెల్లూరులో చంద్రబాబు పర్యటన - టీడీపీలో చేరనున్న వేమిరెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 5:01 PM IST

thumbnail

TDP Leader Kotam Reddy Sridhar Reddy on Chandrababu Tour: తెలుగుదేశం అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్​ సెంటర్ (​VPR Convention Centere)కు మార్చి 2న వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను తెలుగుదేశం నేతలు (TDP Leaders) పర్యవేక్షించారు. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (TDP Leader Kotam Reddy Sridhar Reddy) తెలిపారు. వీపీఆర్ సెంటర్​లో ఏర్పాట్లను అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పరిశీలించారు.

"నెల్లూరులో మార్చి నెల 2వ తేదీన చంద్రబాబు పర్యటన ఉంది. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మార్చి రెండో తేదీన చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతారు. ఆయనతో పాటు డిప్యూటీ మేయర్ రూప్​ కుమార్​ యాదవ్​ కూడా టీడీపీలో చేరనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్​ సెంటర్​కు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం." - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.