LIVE: శ్రీకాకుళంలో చంద్రబాబు "రా కదలిరా" సభ - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 3:51 PM IST

Updated : Feb 26, 2024, 6:28 PM IST

thumbnail

TDP Chandrababu Ra Kadali Ra Public Meeting Live: రానున్న సార్వత్రిక ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తపరిచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "రా-కదలిరా" సభను సోమవారం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు భారీగా తరలిరానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సభా స్థలికి చేరుకుని సుమారు రెండు గంటలపాటు ప్రసంగించనున్నారు. ఈ సభ కోసం టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికతోపాటు ముఖ్య అతిథులు, మీడియా ప్రతినిధులు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, మద్దతుదారులకు సంబంధించిన గ్యాలరీలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం "రా-కదలిరా" సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షప్రసారం.

Last Updated : Feb 26, 2024, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.