LIVE: మాడుగులలో టీడీపీ అధినేత "రా-కదలిరా" సభ- ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 12:08 PM IST

Updated : Feb 5, 2024, 1:49 PM IST

thumbnail

TDP Chandrababu Ra Kadali Ra Madugula Public Meeting Live: రానున్న సార్వత్రిక ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తపరిచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "రా-కదలిరా" సభను సోమవారం అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరై ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగల నియోజకవర్గ పరిధి కె కోటపాడు మండలం గొండుపాలెంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 

జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు భారీగా తరలిరానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఉదయం 11.30 గంటటలకు సభా స్థలికి చేరుకుని సుమారు రెండు గంటలపాటు ప్రసంగించనున్నారు. ఈ సభ కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికతోపాటు ముఖ్య అతిథులు, మీడియా ప్రతినిధులు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, మద్ధతుదారులకు సంబంధించిన గ్యాలరీలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మాడుగుల "రా-కదలిరా" సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షప్రసారం.

Last Updated : Feb 5, 2024, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.