అప్పుల్లో వెనక్కి తగ్గని వైసీపీ ప్రభుత్వం - మరో రూ.4 వేల కోట్ల రుణం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 10:04 AM IST

thumbnail

State Govt Debt in Securities Auctions: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 4 వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని సమీకరించింది. 5, 15, 19 ఏళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చేలా వెయ్యి కోట్ల చొప్పున 7.39 శాతం, 7.49 శాతం, 7.52శాతం వడ్డీకి తీసుకుంది. రాబోయే 12, 17 ఏళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా చెరో 500 కోట్లు 7.49శాతం, 7.46శాతానికి వడ్డీకి సమీకరించింది. ప్రతి మంగళవారం రిజర్వు బ్యాంకు బహిరంగ మార్కెట్‌ రుణాల కోసం సెక్యూరిటీల వేలం నిర్వహిస్తోంది. పండుగ సెలవులు, ఇతర జాతీయ సెలవులు ఉంటే ఒక రోజు ముందుగానో, ఒక రోజు ఆలస్యంగానో సెక్యూరిటీల వేలం ఉంటుంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 45 మంగళవారాలు రాగా రాష్ట్ర ప్రభుత్వం 34 వారాలు రుణాలు తీసుకుంది. నెల ప్రారంభంలోనే రిజర్వు బ్యాంకు కల్పించిన వెసులుబాట్లు ఉపయోగించి ఓడీ వరకు వెళ్లి జీతాలు, పెన్షన్లూ చెల్లించాల్సి వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బహిరంగ మార్కెట్‌ ద్వారా ఏపీ సర్కార్‌ 66వేల కోట్ల రుణం తీసుకుంది. ఇది కాకుండా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు అదనంగా ఉన్నాయి. నాబార్డు, కేంద్ర రుణాలు, ఇతర ప్రజారుణాలు కూడా కలిపితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్లకు మించి అప్పులు చేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.