అక్కసుతోనే తనపై అక్రమ కేసులు-వైసీపీ నేతల చరిత్రంతా నా వద్ద ఉంది: సూరా శ్రీనివాసులు రెడ్డి
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 7:52 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-01-2024/640-480-20606447-thumbnail-16x9-kovur-ycp-mla.jpg)
Srinivasulu Reddy Allegations on Kovur YCP MLA: నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై అక్కసుతోనే అక్రమకేసుల్లో ఇరికించారని వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు. మద్యం కేసులో తనను ఎమ్మెల్యే అన్యాయంగా ఇరికించారని శ్రీనివాసులు ధ్వజమెత్తారు. తనకు బారు ఇప్పించింది ఎమ్మెల్యేనేనని, 15 నెలలుగా బార్ నిర్వహిస్తున్న తాను ప్రతినెల 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి పంపిస్తున్నానని తెలిపారు. ఇటీవల వైసీపీకి దూరంగా ఉండటంతో, పార్టీ మారుతానన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే అన్యాయంగా మద్యం కేసులో ఇరికించారని చెప్పారు. తన బారులో అక్రమంగా ప్రవేశించి, మద్యం బాటిళ్లు తీసుకువెళ్లారని అన్నారు. ఆ మద్యం బాటిళ్లనే బెల్ట్ షాపుల్లో పెట్టి తనపై కేసు నమోదు చేశారన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలన్ని ఉన్నాయని, న్యాయపరంగా పోరాడుతానన్నారు. కోవూరు వైసీపీ నాయకుల చరిత్ర అంతా తన వద్ద ఉందని, బయటపెడితే వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. రాజకీయ చరిత్ర ఉన్న నల్లపురెడ్డి కుటుంబ ప్రతిష్టను ప్రసన్నకుమార్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.