దుకాణాలకు అడ్డంగా బారికేడ్లు- రోడ్లపై ప్రమాదకరంగా పార్టీ జెండాలు 'ఇదేం సాధికార యాత్ర సారూ!'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 12:57 PM IST

thumbnail

Shops Colse Due to YSRCP Samajika Sadhikara Yatra In Guntur District : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇవాళ (బుదవారం) నిర్వహించే సామాజిక సాధికార యాత్ర సందర్భంగా ప్రధాన రోడ్డులో దుకాణాలను వైఎస్సార్సీపీ నేతలు బలవంతంగా మూయించారు. దుకాణాలకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు. దీంతో తాము ఒకరోజు ఆదాయాన్ని కోల్పోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మంగళగిరి గౌతమ బుద్ధ రహదారి వెంట భారీ పార్టీ జెండాలను కట్టారు. ఇది వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారింది. గాలికి జెండా చిరిగి రోడ్డు మీద పడితే వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చోదకులు వాపోయారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ మార్గంలో ఓ దాత ఆర్చీ నిర్మిస్తున్నారు. యాత్ర సాగే మార్గంలో ఆర్చీ నిర్మాణానికి పెట్టిన సెంట్రింగ్‌ కర్రలు అడ్డుగా ఉన్నాయంటూ నగరపాలక సంస్థ అధికారులు వాటిని తొలగించారు. దీంతో దాత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.