మాట తప్పిన జగన్- పుర, నగరపాలక సంస్థలపైకి ఆరోగ్యభత్యం భారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 11:33 AM IST

thumbnail

Sanitation Workers Health Allowance Burden On City And Municipal Corporations: పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం నెలకు 6 వేల రూపాయల చొప్పున ఆరోగ్య భత్యం చెల్లిస్తుందని ప్రకటింటిన సీఎం జగన్‌ మాట తప్పారు. నిధులు లేక పీకల్లోతు కష్టాల్లో ఉన్న పుర, నగరపాలక సంస్థలపైకి ఆరోగ్యభత్యం భారాన్ని నెట్టేశారు. ఈ ఆదేశాలతో ఏడాదికి 243 కోట్ల 55 లక్షల రూపాయల భారాన్ని స్థానిక సంస్థలు భరించాల్సిన అగత్యం ఏర్పడింది. 
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఈ ఏడాది జనవరిలో పారిశుద్ధ్య కార్మికులు (Municipal Workers) నిరవధిక సమ్మె చేపట్టారు. కార్మిక సంఘాలతో చర్చల్లో ఇకపై ఆరోగ్య భత్యంతో కలిపి వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో 36 ప్రకారం కార్మికులకు ఆరోగ్య భత్యంతో కలిపి వేతనాన్ని పట్టణ స్థానిక సంస్థలే చెల్లించాలి. ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆస్తి పన్ను ద్వారా సమకూరే సాధారణ నిధుల్ని అందుకు వెచ్చించాలి. కార్మికులకు జీతంతో (salary) కలిపి ఆరోగ్య భత్యం చెల్లించాక ఆ తర్వాత నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొనడంపై అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థలకు ప్రతి నెలా ఈ మొత్తాలను ప్రభుత్వం మొదటే విడుదల చేస్తే జీతాలతో కలిపి ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకు విరుద్ధంగా కార్మికులకు జీతంతో కలిపి ఆరోగ్య భత్యం చెల్లించాక ఆ తర్వాత నిధులు కేటాయిస్తామని చెప్పడంపై అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.