చెరువులో కొండచిలువ కలకలం - పరుగులు తీసిన మహిళలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 2:58 PM IST

thumbnail

Python At YSR District : వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల చెరువులో కొండచిలువ కలకలం రేపింది. చెరువు దగ్గర దుస్తులు ఉతకడానికి వెళ్లిన కొంతమందికి మహిళలకు కొండచిలువ కనిపించింది. భయాందోళనతో మహిళలు అక్కడి నుంచి రోడ్డుపైకి పరుగులు తీశారు. అనంతరం గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు హుటాహుటినా అక్కడికి చేరుకుని దాన్ని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో అందరూ చూస్తుండగానే కొండచిలువ చెరువులోకి వెళ్లిపోయింది. 

నిత్యం ఎంతో మంది మహిళలు ఇక్కడికి దుస్తులు ఉతకడానికి వస్తుంటారు. ఇప్పుడు కొండచిలువ చెరువులోకి వెళ్లిపోవడంతో వారంతా భయభ్రాంతులకు గురౌతున్నారు. చివరికి గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను సంప్రదించారు. అధికారులు స్పందించి కొండచిలువను పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అయితే ఇటీవల కాలంలో కాలువల గట్లు, గుబురు పొదలు, చెరువులు ఎక్కువగా ఆక్రమణలకు గురౌతున్నాయి. అందువల్ల పాములు, ఇతర కీటకాలు జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడంతో అక్కడ ముళ్లతుప్పలు, కంపచెట్లు పెరిగి పాములు సంచరించడానికి ఆవాసయోగ్యంగా మారుతున్నయని స్నేక్ క్యాచర్​లు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.