ముద్రగడకు కేఏ పాల్ ఆహ్వానం - 'పాల్ రావాలి పాలన మారాలి' అంటూ హల్​చల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 1:08 PM IST

Updated : Mar 12, 2024, 8:34 PM IST

thumbnail

Praja Shanthi Party Leader KA Paul Comments: గుంటూరు జిల్లా ఉండవల్లి చంద్రబాబు నివాసం (Chanda babu Naidu House) వద్ద ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ హడావుడి చేశారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తమ పార్టీలోకి రావాలంటూ కేఏ పాల్ ఆహ్వానించారు. చిత్తశుద్ధి ఉంటే కాపులంతా ప్రజాశాంతి పార్టీలోకి రావాలని పాల్ అన్నారు. కరకట్టపై మీడియాతో (media) మాట్లాడుతూ పాల్ రావాలి పాలన మారాలంటూ హల్‌చల్ చేశారు.

KA Paul Invited Mudragada PadmaNabham in His Party: సచివాలయం వైపు నుంచి విజయవాడకు వస్తూ చంద్రబాబు ఇంటి వద్ద మీడియా ప్రతినిధుల్ని చూసి పాల్‌ ఆగి మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం ఆలోచించి ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆయన్ను ఆహ్వానిస్తున్నాం అని పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలను మే నెల చివరి ఫేజ్​లో నిర్వహించేలా ఎన్నికల కమిషన్​ను ఆదేశించాలని, తద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియ వెంటనే జరుగుతుందని, ఈవీఎంల ట్యాంపరింగ్​కు అవకాశం లేకుండా ఉంటుందని పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

Last Updated : Mar 12, 2024, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.