ఇచ్చిన హామీలు నెరవేర్చని ఎమ్మెల్యే మాకొద్దు: పలమనేరు ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 5:49 PM IST

thumbnail

People Fired on Palamaneru MLA Venkata Gowda: ఎలాగు నెరవేర్చము కదా కాబట్టి పదవి పొందటం కోసం ఏ హామీ ఇస్తే ఏంటి అని 11 హామీలను (11 Guarantees) ఇచ్చి వాటిని అమలుపరుస్తానని అసత్య ప్రచారం చేశాడు ఓ ఎమ్మెల్యే. ఆ అబద్ధపు మాటలు నిజమని నమ్మి ప్రజలు ఓటు వేసేశారు. ఇంకేముంది పదవి వచ్చింది, ఐదు సంవత్సరాల వరకూ ప్రజలతో నాకేం అవసరం అని ముఖం చాటేశాడు. ఇచ్చిన హామీలు నేరవేర్చటం గురించి ఎమ్మెల్యే మర్చిపోయినా ప్రజలు మర్చిపోతారా? తమ సమస్యలను అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించని ఎమ్మెల్యే మాకెందుకని ఖరాఖండిగా ప్రజలు తిరస్కరించే పరిస్థితి నెలకొని ఉంది. 

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ సీటు కోసం 2019లో వెంకట గౌడ పలమనేరు నడిబొడ్డున జగన్ పక్కన నిలబడి 11 హామీలను ఇచ్చారు. అవి  పలమనేరులోని పెద్ద చెరువులోకి వెళుతున్న డ్రైనేజీ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తాము, గంగన్న శిరస్సు ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం, పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి కనెక్షన్ అందిస్తాము, ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తాం, టమోటా రైతులకు పంట నిల్వ ఉంచుకునేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తాం, జల్లి పేట రెవిన్యూ గ్రామంలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తాం, స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కల్పిస్తాం, ఏనుగుల సమస్య పూర్తిస్థాయిలో కర్ణాటక తమిళనాడు రాష్ట్ర అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తాం, పత్తి రైతులు 50 రూపాయల ఇన్సెంటివ్​ను సక్రమంగా అందిస్తాం, మూతబడిన పట్టుగూళ్ల రీలింగ్ సెంటర్​ను మళ్లీ ప్రారంభిస్తాం, బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ జలపాతం వద్ద ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తాం, హంద్రీనీవా ద్వారా అన్ని మండలాల రైతులకు సాగునీరు అందిస్తాం.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా మరచిన ఎమ్మెల్యేగా వెంకట గౌడ (MLA Venkata Gowda) చరిత్రకెక్కాడు. అందులో కనీసం ఒక్కటి కూడా పూర్తి చేయలేక ఇంకో అవకాశం ఇవ్వండి అంటూ ఎన్నికలకు సిద్ధమైపోయాడు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోగా, ఆ ప్రాంతాలను కూడా సందర్శించలేదని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.