పాల్వాయి గేటు పోలింగ్​ కేంద్రంలోని పీవో, సిబ్బందిపై ఈసీ వేటు - PO and Staff Suspend

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 9:02 AM IST

Updated : May 23, 2024, 9:30 AM IST

thumbnail
పాల్వాయి గేటు పోలింగ్​ కేంద్రంలోని పీవో, సిబ్బందిపై ఈసీ వేటు (ETV Bharat)

Paluvoi Gate Village PO and Staff Suspend By Election commision : విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రం పీవో (PO -Presiding Officer), సిబ్బందిని ఎన్నికల కమిషన్​ (ఈసీ) సస్పెండ్ చేసినట్లు  తెలిసింది. ఈ నెల 13న ( మే 13న) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రం లోకి వచ్చి ఈవీఎంను ధ్వంసం చేస్తున్నా అడ్డుకోకపోవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఎమ్మెల్యే కేంద్రంలోకి రాగానే పీవోతో పాటు సిబ్బంది లేచి నిలబడి నమస్కరించినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది.

వీటిని పరిగణనలోకి తీసుకుని పీవోతో పాటు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆర్వో శ్యాం ప్రసాద్​కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసు కున్నట్లు సమాచారం. దీనిపై ఆర్వో శ్యాం ప్రసాద్​ వివరణ కోరగా పీవో తమకు అందుబాటులోకి రాలేదని ఈసీకి తెలియజేశారు. పీవో అందుబాటులోకి రాగానే అతనిపై విచారణ చేపడుతున్నామని చెప్పారు.

Last Updated : May 23, 2024, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.