అభివృద్ధా, విధ్వంసమా! ఏది కావాలో ప్రజలు ఆలోచించాలి : నందమూరి బాలకృష్ణ - Nandamuri Balakrishna

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 12:20 PM IST

thumbnail
అభివృద్ధా, విధ్వంసమా! ఏది కావాలో మీరే ఆలోచించండి : నందమూరి బాలకృష్ణ (ETV Bharat)

Nandamuri Balakrishna Election Campaign in Visakha District : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు రౌడీల్లా వ్యవహరించడమే తెలుసు, అభివృద్ధి తెలియదని, ప్రజల బాధలు పట్టవని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. జగర్​ సర్కారును గద్దె దింపటానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖలో నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జాలారిపేటలో రోడ్‌ షో నిర్వహించిన బాలకృష్ణకు అభిమానులు భారీ బైక్‌ ర్యాలీతో స్వాగతం పలికారు. రోడ్‌ షో కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఆకాశాన్నంటే ధరలను నియంత్రించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. పెట్రోల్​ ధరలు, నిత్యావసరాలు, ఇంటి పన్ను, నీటి పన్ను ఆఖరికి చెత్త పన్నును కూడా జగన్ పెంచేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే చేసిందేమీ లేదని, రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలంటే కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.