LIVE: పుట్టపర్తిలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం - ప్రత్యక్షప్రసారం - Balakrishna Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 8:52 PM IST

Updated : Apr 13, 2024, 9:26 PM IST

thumbnail

Nandamuri Balakrishna Election Campaign in  Puttaparthi Live : ఎన్నికలను సమీస్తున్న తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచార జోరును పెంచారు. ఈ నేపథ్యంలోనే ' స్వర్ణాంధ్ర సాకార యాత్ర ' పేరుతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ యాత్రను సత్యసాయి జిల్లా కదిరి నుంచి ప్రారంభించనున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ప్రత్యేక హెలికాప్టర్​లో హైదరాబాద్​ నుంచి కదిరికి చేరుకున్నారు. అక్కడ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కదిరిలో భారీ ర్యాలీని చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే పుట్టపర్తి కొత్తచెరువు ప్రధాన కూడలిలో బాలకృష్ణ రోడ్​ షో నిర్వహించనున్నారు. బాలకృష్ణ పర్యటనను దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యకర్తలు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బాలకృష్ణ పాల్గొనే ర్యాలీ, రోడ్ షో పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొనున్నాట్లు నాయకులు తెలిపారు. ప్రస్తుతం పుట్టపర్తిలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : Apr 13, 2024, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.