పిన్నెల్లి అరాచకాలు - టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు​పై దాడి - వెలుగులోకి వీడియో - PINNELLI FOLLOWERS ATTACK

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 4:53 PM IST

thumbnail
పిన్నెల్లి అరాచకాలు - టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు​పై దాడి - వెలుగులోకి వీడియో (ETV Bharat)

MLA Pinnelli and Followers Attack on TDP Leaders : రాష్ట్రంలో పోలింగ్‌ రోజున మాచర్లలో వైఎస్సార్సీపీ నాయకులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన అనంతరం అడ్డుకోబోయిన టీడీపీ నేత నంబుల శేషగిరిరావుపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. గ్రామస్థులు ఎదురుతిరగడంతో అనుచరులతో సహా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ నుంచి పరారయ్యారు. సంబంధిత వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు టీడీపీకి గట్టి పట్టున్న గ్రామం. పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయన్న ఉక్రోషంతో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని వెంటేసుకుని బూత్​లోకి దూసుకెళ్లారు. 

అనంతరం శాసనసభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్న కంపార్ట్​మెంట్​లోకి వెళ్లి ఈవీఎంను రెండు చేతులతో ఎత్తి, నేలకేసి బలంగా కొట్టారు. ఈవీఎంతోపాటు, వీవీప్యాట్ కూడా కింద పడి ధ్వంసమయ్యాయి. వాటిని తన్నుకుంటూ టీడీపీ ఏజెంట్ నంబుల శేషగిరిరావుపై వేలు చూపించి బెదిరిస్తూ ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. అనంతరం శేషగిరిరావుపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో పిన్నెల్లి, మిగత వైఎస్సార్సీపీ నేతలపై పాల్వాయిగేటు గ్రామస్థులు ఎదురు తిరిగారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.