ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా - రాజకీయాలతో సంబంధం లేదు: మోహన్ బాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 4:54 PM IST

Updated : Mar 17, 2024, 6:16 PM IST

thumbnail

Manchu Vishnu Art Foundation : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో మోహన్ బాబు యూనివర్సిటీలో యూనివర్సిటీలో మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మంచు మోహన్ బాబు జన్మదినం మార్చి 19వ తేదీ ముందు రోజులలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గత 11 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. యూనివర్సిటీలోని లైబ్రరీలో జ్యోతి ప్రజ్వలన చేసి మంచు మోహన్ బాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చిత్రకారులు పాల్గొన్నారు. 

Mohan Babu Birthday : మోహన్ బాబు మాట్లాడుతూ 31 సంవత్సరాలలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు మోహన్ బాబు యూనివర్సిటీగా ఎదగడానికి ప్రతి ఒక్కరి సమిష్టి కృషి కారణమని తెలిపారు. అతి త్వరలోనే భారతదేశంలోనే అతి గొప్ప కళాశాలగా మోహన్ బాబు యూనివర్సిటీ పేరు పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల గురించి విలేకరులు ప్రశ్నించగా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నానని మాట దాట వేశారు

చిత్రాల ద్వారా మన పూర్వీకుల జీవనశైలిని తెలుసుకుంటున్నామని మంచు విష్ణు తెలిపారు. మార్చి 19న మోహన్ బాబు జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చిత్ర కళాకారులను సన్మానించడం జరుగుతుందని అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలోని విద్యార్థిని విద్యార్థులకు చిత్ర కళాకారులు గీసిన చిత్రాల ద్వారా మన పూర్వీకుల జీవన శైలిని తెలుసుకుంటున్నారని, అలాగే మన భవిష్యత్తు తరాలకు కూడా ఈ చిత్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. 

Last Updated : Mar 17, 2024, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.