శివునిలో సగం - అవనిలో సగం - ఆకట్టుకునేలా సైకత శిల్పం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 3:51 PM IST

thumbnail

Lord Shiva And Women's Day Special Sand Sculpture in East Godavari District : మహాశివరాత్రి, అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని (Women's Day) పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ ప్రత్యేకమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. మహా శక్తి అమ్మవారి రూపంలో ఉన్న ఈ సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది. గ్రామంలోని శివాలయం వద్ద ఇసుకతో అమ్మవారి రూపాన్ని తీర్చిదిద్ది కూరగాయలు, పండ్లతో అలంకరించారు. "శివునిలో సగం అమ్మవారు అయితే అవనిలో సగం మహిళ" అని చాటి చెబుతూ సైకత శిల్పాన్ని (Sand Sculpture) రూపొందించారు. ఈ సందర్భంగా సైకత శిల్పాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు (Devotees) తరలి వస్తున్నారు.

'25 టన్నుల ఇసుకతో ఈ శిల్పాన్ని రూపొందించాం. సమాజంలో మహిళలకు సముచిత స్థానం కల్పించడానికి గుర్తుగా మహా శివుడే తన శరీరంలో అర్థభాగాన్ని  పార్వతికి ఇచ్చారు. దాన్ని ప్రతిబింబించేలా  మా పిల్లలతో కలిసి ఈ శిల్పాన్ని తయారు చేశాము.' -దేవిన శ్రీనివాస్, సైకత శిల్పి     

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.