LIVE: పెనుకొండలో లోకేశ్​ శంఖారావం - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 6:12 PM IST

Updated : Mar 7, 2024, 6:32 PM IST

thumbnail

Nara Lokesh Sankharavam Meeting Live : నేటి నుంచి రాయలసీమలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  రెండో విడత 'శంఖారావం' పర్యటనలు ప్రారంభం అయ్యాయి. నేడు నారా లోకేశ్ హిందూపురం నుంచి 'శంఖారావం' ప్రారంభించారు. ఇవాళ హిందూపురం సభ ముగిసింది. ప్రస్తుతం పెనుకొండ సభల్లో పాల్గొన్నారు. రేపు పుట్టపర్తి, కదిరిలో నారా లోకేశ్  'శంఖారావం' సభల్లో పాల్గొంటారు.  వైసీపీ హయాంలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మందిని హత్య చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. బీసీలకు రావాల్సిన రూ.25 వేల కోట్లను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించిందని మండిపడ్డారు. హిందూపురంలో నిర్వహించిన శంఖారావం సభలో నారా లోకేశ్ మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 50 ఏళ్లు పైబడిన బీసీలకు ప్రతి నెలా 4 వేల రూపాయలు అందించబోతున్నామని తెలిపారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామన్న లోకేశ్, బీసీలకు స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో 10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 8వ తేదీన పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లోను, 9వ తేదీన కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోను, 10వ తేదీన ఉరవకొండ, అనంతపురం, శింగనమల నియోజకవర్గాల్లోను, 11వ తేదీన తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం నిర్వహించనున్నారు.పెనుకొండ నియోజకవర్గంలో నారా లోకేశ్ శంఖారావం ప్రత్యక్ష ప్రసారం మీ కోసం

Last Updated : Mar 7, 2024, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.