'థ్యాంక్యూ సీఎం సార్​' - ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో న్యాయవాదుల సంబరాలు - Land Act Repeal Lawyers Cut Cake

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 10:42 PM IST

thumbnail
'థ్యాంక్యూ సీఎం సార్​' - ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో న్యాయవాదుల సంబరాలు (ETV Bharat)

Lawyers Celebrate The Repeal of Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడాన్ని హర్షిస్తూ రాష్ట్రంలోని న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. థ్యాంక్యూ సీఎం అంటూ కేక్ కట్ చేశారు. విశాఖ న్యాయస్థానం సముదాయం వద్ద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ శ్రీ భరత్‌ హాజరయ్యారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ చిత్రపటాలకు న్యాయవాదులు పాలాభిషేకం చేశారు. 

బాపట్ల జిల్లా చీరాలలోని బార్ అసోసియేషన్ హాలులో న్యాయవాదులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో న్యాయవాదులు కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేయడం పట్ల న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటలింగ్ చట్టం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిందని దీనిపై గతంలో ధర్నాలు నిరసనలు తెలపడం జరిగిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం అయిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయడం ఎంతో సంతోషమని న్యాయవాదులు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.