5 ఏళ్లుగా బెయిల్​ రాకుండా జైల్లో ఉంచుతున్నారు- సీఎం జగన్ కనికరించాలంటున్న కోడికత్తి శ్రీను తండ్రి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 1:21 PM IST

thumbnail

Kodikatthi Srinu father Tatarao worry : జగన్​ని అభిమానించినందుకు తన కుమారుడిని అయిదేళ్లుగా జైల్లోనే ఉంచుతున్నారంటూ కోడికత్తి శ్రీను తండ్రి తాతారావు ఆవేదన వ్యక్తం చేశారు. 2018 అక్టోబరు 25న విశాఖ విమానాశ్రయంలో ఏం జరిగిందన్నది ఆ దేవుడికే తెలుసు అని పేర్కొన్నారు. కుటుంబాన్ని పోషించే కుమారుడిని జైల్లో పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. 

CM Jagan should come to the court and testify : ముఖ్యమంత్రి జగన్​ ఇప్పటికైనా మనసు మార్చకుని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని తాతారావు విజ్ఞప్తి చేశారు. అయిదేళ్లుగా తన కుమారుడికి బెయిల్​ కూడా మంజూరు చేయకుండా జైల్లో మగ్గబెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన కుమారుడిపై కనికరం చూపలని కోరుకున్నారు. ఎన్​ఐఏ ఏం జరగలేదని చెబుతున్న తన కుమారుడి కేసును న్యాయమూర్తులు జాప్యం చేస్తున్నారని ఆందోళన చెందారు. న్యాయమూర్తులు ఇప్పటికైనా తన కుమారుడి కేసును విచారించి జైలు నుంచి విడుదల చేయాలని కోరుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.