ఆ ఆలయానికి వెళ్తే యువతీ, యువకులకు పెళ్లి గ్యారంటీ!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 2:59 PM IST

thumbnail

Katrenikona Chollangi Amavasya Festival in Konaseema District : కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బ్రహ్మాసమేద్యంలోని కాలభైరవ స్వామి ఆలయంలో చొల్లంగి అమావాస్య పర్వదిన పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ సమీపంలో ఉన్న సముద్రతీరంలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. గోదావరి జిల్లాలోని 62 మత్స్యకారుల గ్రామాల ప్రజలు ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపకొంటారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లోని యువతీ, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి భైరవస్వామిని దర్శించుకుంటారు.

Chollangi Amavasya 2024 Pushya Masa Amavasya : వివాహం కాని వారు అమావాస్య రోజున భైరవస్వామి ఆలయంలో నిద్రిస్తే తప్పక ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఏటా చొల్లంగి అమావాస్య (Chollangi Amavasya) రోజున భక్తులు కోలాహలంగా కాలభైరవ స్వామిని కొలుస్తారు. గ్రామ పెద్దలు, ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో రద్దీగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.