అవనిగడ్డలో దారుణం - ఎస్సీ బాలికపై కబడ్డీ కోచ్ అత్యాచారం - Kabaddi Coach Rape on Girl

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 9:32 AM IST

thumbnail

Kabaddi Coach Rape on Girl : కబడ్డీ ఆటలో మెళకువలు నేర్పిస్తామంటే నమ్మి వారి వద్దకు వెళ్లిన ఓ ఎస్సీ బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడారు. ఈ ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన ఓ బాలిక రోజూ స్థానికంగా ఓ మైదానానికి వెళ్లి కబడ్డీ ప్రాక్టీస్‌ చేసేవారు. అదే మైదానానికి వచ్చే ప్రైవేటు శిక్షకుడు టి. పవన్‌ కుమర్‌, క్రీడాకారులు సీహెచ్‌. డోగేంద్ర మహావిష్ణు, పి. కొండలరావు తాము ఉంటున్న చోటికి వస్తే కబడ్డీలో మరిన్ని మెళకువలు నేర్పిస్తామని బాలికను నమ్మించారు. వారితో ఉన్న పరిచయం కారణంగా ఈ నెల 7న వారి గదికి వెళ్లిన బాలికను ముగ్గురూ అత్యాచారం చేసి వీడియో తీశారు. దాని ఆధారంగా బెదిరించి 8, 9 తేదీల్లో కూడా వారి గదికి రప్పించుకున్నారు. ముభావంగా ఉంటున్న బాలికను తల్లి ప్రశ్నించడంతో మంగళవారం ఈ విషయం బయటపడింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.