Live: నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం - మంగళగిరి నుంచి ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 12:43 PM IST

Updated : Mar 18, 2024, 1:00 PM IST

thumbnail

Nadendla Manohar Press Meet LIVE From  Mangalagiri: జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న పల్నాడు జిల్లా  చిలుకలూరుపేటలో జనసేన, టీడీపీ, బీజేపీ నిర్వహించిన ఉమ్మడి సభ విజయవంత కావడానికి కృషి చేసిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వాహణలో పోలీసులు విఫలమయ్యారని నాదెండ్ల తెలిపారు. పల్నాడు ఎస్పీ, పోలీసుల తీరుపై ఫిర్యాదుకు కూటమి నేతల నిర్ణయం తీసుకున్నారని  పేర్కొన్నారు. ప్రజాగళం సభకు పోలీసులు అడుగడుగునా అనేక అవరోధాలు సృష్టించారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాల్గొంటున్న సభ అయినా బేఖాతరుగా వ్యవహరించారని ఆరోపించారు. సభ విఫలానికి పన్నిన కుట్రలో భాగమని ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ   ఆరోపించారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పల్నాడు ఎస్పీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రముఖులకూ సకాలంలో పాస్‌లు ఇవ్వకుండా జాప్యం చేయడంలో కుట్ర ఉందని టీడీపీ నేతలు నిన్న ఆందోళన చేపట్టారు. నిన్న జరిగిన సభలో జనసేన నేతలు  నాగబాబు, మనోహర్ వంటి ముఖ్య నాయకులనూ వేదికపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.  

Last Updated : Mar 18, 2024, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.