ప్రేమ జంట కులాంతర వివాహం- రక్షణ కావాలంటూ వేడుకోలు - Inter Caste Marriage

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 9:53 AM IST

thumbnail
ప్రేమ జంట కులాంతర వివాహం- రక్షణ కావాలంటూ వేడుకోలు (ETV Bharat)

Inter Caste Marriage in West Godavari District : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రేమ జంట సామాజిక వివాహ వేదికగా కులాంతర వివాహం చేసుకుంది. తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నవ దంపతులు కోరారు. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాలోని ఉండి మండలం నిమ్మలపేటకు చెందిన వెన్నెటి సురేష్, కావ్య శ్రీ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వీరిద్దరి ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు.

Inter Caste Marriage Problems : తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ వారు కులాంతర వివాహాలు చేస్తారని తెలుసుకున్నారు. అనంతరం ప్రేమ జంట వారిని సంప్రదించించారు. సామాజిక వివాహ వేదిక ఆచారం ప్రకారం ప్రమాణాలు చేసి దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. కావ్య శ్రీ కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమను కాపాడాలని వెన్నెటి సురేష్ కోరారు. తమ రక్షణ కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ దగ్గరకు వెళ్లనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.