వ్యర్థాలతో చేపల పెంపకం - ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 2:23 PM IST

thumbnail

Illegal Fishing Ponds In Anakapalli District : చేపల పెంపకానికి పశువులు, గొర్రెలు, మేకల కళేబరాలు, కోడి మాంసం వ్యర్థాలను వాడుతున్న చెరువుల నిర్వాహకులపై క్రిమినల్ (Criminal) కేసులు నమోదు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండు చేశారు. కలిగొట్ల, కొత్త పెంట, ములకలాపల్లి, పెదనందిపల్లి తదితర గ్రామాల్లో చేపల చెరువులను (Fishing Ponds) ఆయన పరిశీలించారు. 

డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడుకి మాడుగుల నియోజకవర్గంలో బినామీ పేర్లతో చేపల పెంపకం చెరువులు ఉన్నాయని వెంకన్న ఆరోపించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు వెయ్యి ఎకరాల్లో అనధికారిక (Illegal) చేపల చెరువులు నిర్వహిస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోలేదని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే వ్యర్థాలను వీటికి ఆహారంగా వేస్తున్నట్లు తమ పరిశీలనలో గుర్తించామన్నారు. ఆ చేపలు తింటే ప్రజల ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమన్నారు. అధికారులు స్పందించి దాడులు నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.