ప్రభుత్వ ప్రకటనల్లో సుప్రీం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి: హైకోర్టు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 3:42 PM IST

thumbnail

High Court on Government Advertisements: ప్రభుత్వం జారీ చేసే ప్రకటనలు సుప్రీంకోర్టు నిబంధనలను విరుద్ధంగా ఉన్నాయని చెన్నుపాటి సింగయ్య అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీని ప్రోత్సహించేందుకు ప్రకటనలు ఇచ్చారని పిటిషన్​లో ఆయన పేర్కోన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో సుప్రీం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్​కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. 2015లో మీడియాలో ఇచ్చే ప్రకటనలపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, వ్యక్తులను గొప్పగా చిత్రీకరించే విధంగా ప్రకటనలివ్వొద్దని సుప్రీం మార్గదర్శకాలున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్​సీపీని ప్రోత్సహించేలా ప్రకటనలు ఇచ్చారన్న న్యాయవాది, గత ప్రభుత్వాన్ని విమర్శించేలా ప్రకటనలు ఉన్నాయని వాదనలు వినిపించారు. ప్రకటనల కోసం చేసిన ఖర్చును సదరు రాజకీయ పార్టీ నుంచి వసూలు చేయాలని న్యాయవాది కోరారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.