ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు- సమస్యగా మారిన వాహనాల పార్కింగ్‌ - Indrakiladri durgamma temple

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 2:37 PM IST

thumbnail
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు- సమస్యగా మారిన వాహనాల పార్కింగ్‌ (ETV Bharat)

F2F With Indrakiladri Temple EO KS Rama Rao in Vijayawada : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. సాధారణ రోజుల్లో 25 వేల నుంచి 30 వేల మంది భక్తులు వచ్చే వారని ఆలయ ఈవో కేఎస్​ రామారావు తెలిపారు. ప్రత్యేక రోజుల్లో 50 వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు.

అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడమే కాకుండా సొంత వాహనాలతో వస్తుండడం వల్ల పార్కింగ్‌ పెద్ద సమస్యగా మారిందని కేఎస్​ రామారావు తెలియజేశారు. కనకదుర్గా నగర్‌లో అభివృద్ధి పనులు చేస్తుండడం వల్ల వాహనాల పార్కింగ్​ స్థలం కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు త్వరగా అమ్మవారి దర్శనం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేశామని కేఎస్​ రామారావు వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.