తండ్రి అంత్యక్రియలు చేసిన కుమార్తె - అభినందించిన గ్రామ పెద్దలు - Daughter Done Last Rites to Father

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 9:31 PM IST

thumbnail

Daughter Did Father Funerals in Undrajavaram: సాధారణంగా తండ్రి చనిపోతే అతని కుమారులు తలకొరివి, కర్మకాండలు నిర్వహించడం సర్వసాధారణం. కానీ కొడుకు లేని వారు చనిపోతే సమీప బంధువులు నిర్వహించడం మనం చూస్తుంటాం. తండ్రి చనిపోతే కన్న కుమార్తె కర్మకాండలు నిర్వహించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో జరిగింది. లింగాలపేట గ్రామానికి చెందిన రేగు శ్రీనివాస్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలే ఉన్నారు. అంత్యక్రియలు చేయడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

తండ్రి చనిపోవడంతో సమీప బంధువులు తర్జన, భర్జన పడటం చూసి మృతుని రెండో కుమార్తె దుర్గ కర్మకాండలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. గ్రామ పెద్దల సహకారంతో సాంప్రదాయ బద్ధంగా తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి కుమారుడు లేని లోటు తీర్చింది. వారి సామాజిక వర్గ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించింది. ఆ తండ్రికి కుమారుడు లేని లోటును కుమార్తె తీర్చిందంటూ గ్రామ పెద్దలు ఆమెను అభినందించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.