దున్నపోతు హల్​చల్​ - గుర్తు పెట్టుకుని వచ్చి మరీ దాడి! భయంతో వణికిపోతున్న ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 8:18 AM IST

thumbnail

Buffalo Attacking People in Anantapuram District : అనంతపురం జిల్లా కణేకల్ మండలం సొల్లాపురంలో ఓ దున్నపోతు స్వైర విహారం చేసింది. రసూలమ్మ అనే మహిళపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే దున్నను దూరంగా తరిమికొట్టి గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరు నెలల క్రితం గ్రామానికి వచ్చిన ఆ దున్నపోతు మూడు నెలల్లోనే సుమారు 60మందిపై దాడిచేసి గాయపరిచిందని గ్రామస్థులు వాపోతున్నారు. 

అయితే మెుదట్లో  గ్రామంలో తిరుగుతూ దొరికిన ఆహార పదార్థాలు తింటున్న దున్నపోతు మూడు నెలలుగా తన ధోరణి పూర్తిగా మార్చుకుంది. ఇళ్ల ఆవరణంలోకి ప్రవేశించి ఎండకు ఆరబెట్టిన ఆహారపు గింజలను తినడం మొదలు పెట్టింది. దీన్ని గమనించిన స్థానికులు దున్నపోతును మందలించే వారు. అయినా ఆ దున్నపోతు మొత్తం గింజలను తినేంత వరకూ అక్కడి నుంచి కదలకుండా ఉండడంతో కర్రతో కొట్టి తరిమేసేవారు. అప్పటి నుంచి తనపై దాడి చేసిన వారు వీధుల్లో కనిపిస్తే చాలు దున్నపోతు రెచ్చి పోయి తీవ్రంగా దాడి చేస్తోంది. ఈ ఘటనలు జరుగుతున్నప్పటి నుంచి దున్నపోతు వీధుల్లో కనిపిస్తే చాలు ప్రజలు భయపడి ఇళ్లలోకి పరుగు తీయడం మొదలు పెట్టారు. అధికారులు దున్నపోతును అటవీ ప్రాంతానికి తరలించి తమను రక్షించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.