జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: సీఎం రమేశ్‌ - CM Ramesh Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 8:21 PM IST

thumbnail
ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: సీఎం రమేశ్‌ (ETV Bharat)

BJP MP Candidate CM Ramesh Election Campaign in Anakapalli: అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రచారనికి అనూహ్య స్పందన వస్తోంది. కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య అధికంగా ఉందన్న విజ్ఞప్తులు ఎక్కువగా వచ్చాయని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని రమేష్ పేర్కొన్నారు. ఎన్నికల్లో జగన్​ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటుని ఆయన అన్నారు.

కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ ప్రచారం: తొలిసారిగా ఇక్కడ కమలం గుర్తును ఓటర్లు ఆదరించి విజయబావుటా దిశగా చేర్చేందుకు మూడు పార్టీల శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. ఒకవైపు వైసీపీ వ్యూహాలకు చెక్ పెడుతూనే మరో వైపు ఓటర్లను ఆకట్టుకునేయత్నం చేస్తున్నారు. ఏడు నియోజకవర్గాలకు కొత్తగా వచ్చానన్న భావన రానీయకుండా అన్ని వర్గాలను సమన్వయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాని సీఎం రమేశ్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.