రాజ్‌భవన్‌లో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 6:05 PM IST

Updated : Jan 26, 2024, 7:33 PM IST

thumbnail

At Home Function in Raj Bhavan LIVE : గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌(Governer Tamilsai) ఆహ్వానం మేరకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని ప్రముఖులను గవర్నర్‌ రాజ్‌భవన్‌కు ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నాంపల్లి పబ్లిక్​ గార్డెన్స్​లో గవర్నర్‌ తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని గవర్నర్ తమిళి సై అన్నారు. నియంతృత్వ ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదని వ్యాఖ్యానించారు. ఎన్నికల తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని స్పష్టంచేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు. గడచిన పదేళ్లలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించారని, నియంతృత్వ ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదని పేర్కొన్నారు. 

Last Updated : Jan 26, 2024, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.