'సేవ్ ఏపీ పోలీస్'- బకాయిలు చెల్లించాలంటూ ఏఆర్ కానిస్టేబుల్ నిరసన - constable protest to arrears pay

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 10:37 AM IST

thumbnail

AR Constable Protest to Arrears Pay The Police: సేవ్ ఏపీ పోలీస్ అంటూ అనంతపురంలో మాజీ ఏఆర్ కానిస్టేబుల్ ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలంటూ డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ జడ్పీ ఆవరణలో మరోమారు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పోలీసులకు రావాల్సిన గ్రాంట్, ఎస్ఎల్ఎస్ (surrender of Leave salary), ఏఎస్​ఎల్​ఎస్ (Additional surrender of Leave salary), టీఏ- డీఏ చెల్లించకుండా సీఎం జగన్ వంచించాడని పేర్కొన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రులు కల్పించుకుని న్యాయం చేయాలని కోరారు.

2022 జూన్​లో సీఎం జగన్ సత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు బకాయిలు చెల్లించాలంటూ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రకాశ్ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అదే సమయంలో గార్ల దిన్నె మండలానికి చెందిన ఓ వివాహితను బెదిరించి నగదు, బంగారం కాజేశాడని నమోదైన కేసులో సస్పెండ్ కాగా రెండు నెలల తర్వాత ప్రకాశ్​ను విధుల నుంచి తొలగించారు. పోలీసుల సమస్యలు పరిష్కరించేలా కేంద్రం చొరవ చూపాలని ఆయన కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.