ఏపీ ఈసెట్​ నోటిఫికేషన్​ విడుదల - రేపటి నుంచి దరఖాస్తు స్వీకరణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 5:22 PM IST

thumbnail

APECET Notification Released in Anantapur District : రాష్ట్రంలో ఇంజినీరింగ్​ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్​ - 2024 నోటిఫికేషన్​ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందని అనంతపురం జేఎన్టీయూ వీసీ శ్రీనివాసరావు అధికారికంగా వెల్లడించారు. ఏప్రిల్​ 15 వరకు ఎలాంటి రుసుములు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. అనంతరం పెనాల్టీతో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. మే 8వ తేదీన పరీక్ష ఉంటుందన్నారు.

పాలిటెక్నిక్​ డిప్లోమా (ఇంజినీరింగ్​ ), బీఎస్సీ (మ్యాథమెటిక్స్​), చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వీసీ శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ఈసెట్​ రిజిస్ట్రేషన్​ ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీ అభ్యర్థులు రూ. 550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఈసెట్​ 2024 పరీక్ష 14 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీఈసెట్​లో 14 కోర్సుల్లో అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మే 8 (బుధవారం) రెండు సెషన్​లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలియజేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.