'జగన్​ను గద్దె దించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి యుద్ధానికి సంకేతాన్నిచ్చాయి' - Amaravati Bahujan JAC Balakotiah

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 4:19 PM IST

thumbnail

Amaravati Bahujan JAC state president Potula Balakotiah Fires on YSRCP Govt : అధికారంలో ఉన్న జగన్​ను గద్దె దించడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి యుద్ధానికి సంకేతాన్ని ఇచ్చాయని అమరావతి బహుజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. ఉద్యమకారులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి అధినేతలను డిమాండ్ (Demond) చేశారు. రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ అరాచక పాలనను అంతమెందించాలని పిలుపునిచ్చారు.

విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకోటయ్య మాట్లాడుతూ జగన్ మీద రఘురామకృష్ణం రాజు చేసిన పోరాటన్ని ప్రజలందరూ గమనించారు, ఇలాంటి పోరాట నాయకుడికి ఎంపీ స్థానం (MP Seat) ఇవ్వడానికి రాజకీయ పార్టీలకు చేతులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామలాంటి వ్యక్తికి సీటు కేటాయించకుండా ఏం యుద్ధం చేస్తారని ప్రశ్నించారు. బీజేపీకి సీటు కేటాయించలేదు. టీడీపీ-జనసేన ఎందుకు కేటాయించలేదన్నారు. రఘురామకృష్ణంరాజు ఇండిపెండెంట్​గా (Indipendent) పోటీ చేయాలి, అమరావతి బహుజన జేఏసీ మద్దతు పలుకుతుందన్నారు.
 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.