సీఎం జగన్​ డ్రామాలు - ఒక గొడ్డలి, కోడికత్తి, ఇప్పుడు గులకరాయి: పృథ్వీరాజ్‌ - Prudhvi Comments On Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 8:09 AM IST

thumbnail

Actor Prudhvi Raj Election Campaign in Gannavaram: సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని సినీ నటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. కోనసీమ జిల్లా పి. గన్నవరంలో జనసేన తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయానికి అన్ని సామాజిక వర్గాలు సహకరించాలని కోరారు. చిన్న గులకరాయి (stone Attack) తగిలితేనే సీఎం జగన్​ ఓ హడావుడి చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చిన్న గాయానికి ఏదో పెద్ద ఆపరేషన్‌ చేసినట్లు 30 మంది డాక్టర్లు వచ్చి పరీక్షించారని పృథ్వీరాజ్‌ (Prudhvi Raj) విమర్శించారు.

సీఎం జగన్​ ఆడుతున్న డ్రామాలు చూస్తుంటే ఒక గొడ్డలి, కోడికత్తి ఇప్పుడు గులకరాయి అని లేవనెత్తారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పాలనతో దళితులకు అన్ని సంక్షేమ పథకాలు సాకారమవుతాయని ఆయన పేర్కొన్నారు. కూటమి పాలనతో దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయని పృథ్వీరాజ్ అన్నారు. వరద పీడిత ప్రాంతంలో ప్రజలు ఉంటున్నా ప్రభుత్వం ఏవిధమైనా సాయం అందించలేదని స్థానికులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.